These are the causes of fires in electric two wheelers
mictv telugu

ఎలక్ట్రిక్ టూవీలర్లలో మంటలకు కారణాలు ఇవీ

May 9, 2022

These are the causes of fires in electric two wheelers

ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో తగులబడిన సంఘటనలు వరుసగా జరిగాయి. దాంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించి ఓ కమిటీ వేసి మంటలకు గల కారణాలను వెలికితీయాల్సిందిగా ఆదేశించింది.

దీంతో ఈ ప్రమాదాలపై హైలెవెల్ కమిటీ విచారించగా, రిపోర్టులోని కొన్ని ప్రాథమిక విషయాలు బహిర్గతం అయ్యాయి. కమిటీ అంచనా ప్రకారం బ్యాటరీ సెల్స్, మాడ్యూల్స్‌లో లోపాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్యాటరీ కేసింగ్‌లో సమస్యలు కూడా ప్రధానంగా ఉన్నాయి. ఓలా స్కూటరులో ఐసోలేటెడ్ థర్మల్ సమస్య కారణంగా వాహనాలు పేలుతున్నాయని తెలిపింది. కాగా, కమిటీ పూర్తి నివేదిక ఇవ్వడానికి రెండు వారాల సమయం అడిగింది. అందుకు కేంద్రం కూడా సమ్మతించినట్టు సమాచారం.