ఏపీ ఎంసెట్, ఇతర ఎంట్రన్స్ పరీక్షల తేదీలు ఇవే..  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ ఎంసెట్, ఇతర ఎంట్రన్స్ పరీక్షల తేదీలు ఇవే.. 

August 14, 2020

These are the dates of AP Mcet and other entrance exams.

కరోనా వైరస్ ఒక్కసారిగా విద్యావ్యవస్థను బాగా దెబ్బతీసిందనే చెప్పాలి. అన్నీ రంగాలు ఒకెత్తు అయితే విద్యారంగం మరో ఎత్తు అన్నట్టు అయిపోయింది. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు స్కూళ్లు లేకపోయి ఇంటివద్దే ఉంటున్నారు. దీంతో వారి చదువులు అటకెక్కాయి. ఈ క్రమంలో పిల్లల చదువులు పాడయ్యాయని కన్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు కరోనాతో సహవాసం చేస్తూ పాఠశాలలను తెరవాలని యోచిస్తున్న విషయం తెలిసిందే. అయితే పిల్లల తల్లిదండ్రులు మాత్రం కరోనా విషయంలో ఇంకా బెంబేలు చెందుతున్నారు. మే నెలలో జరగాల్సిన ప్రవేశ పరీక్షలు నానాటికీ ఆలస్యం అవుతున్నాయి. దీంతో ఎలాగైనా ఈ పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి సెట్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 

ఈ షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 10 నుంచి ఈ పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందులో ఎంసెట్‌, ఎడ్‌సెట్, లాసెట్‌ సహా పలు పరీక్షలు ఉన్నాయి. ముందుగా ఐసెట్‌ పరీక్షలు నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 10న ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ పరీక్షలు ఉంటాయి. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో ఐసెట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత సెప్టెంబర్ 14న ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం జరిగే ఈసెట్‌ పరీక్ష నిర్వహిస్తారు. సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక పీజీ కోర్సుల ప్రవేశాల కోసం సెప్టెంబర్ 28,29, 30 తేదీల్లో పీజీసెట్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. బీఈడీ ప్రవేశాల కోసం ఎడ్‌సెట్ పరీక్ష అక్టోబర్ 1న ఉదయం, అదేరోజు మధ్యాహ్నం లా కోర్సుల కోసం నిర్వహించే లాసెట్ ఉంటుంది. అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఏపీపీఈసెట్ పరీక్షలు ఉంటాయి.