కివీ ఫ్రూట్ అందరికీ తెలిసిందే. మార్కెట్లో విరివిరిగా లభిస్తుంటాయి. ధర కాస్త ఎక్కువగానే ఉన్నా అందులోని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం మెండుగా ఉంటాయి. ఈ కివీలో విటమిన్ సి, ఫైబర్ తో సహా అనేక సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. శరీరంలో ఆక్సీకరణ, ఒత్తిడిని తగ్గించే అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఈ పండులో ఉన్నాయి. అంతేకాదు కీవి ప్రత్యేకత ఏంటంటే…ఇది మీ శరీరంలో రక్తహీనతతో పోరాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మలబద్దకం, కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి దీని వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజుకో కివీ తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం.
1. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
కివీలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతుంది. వాస్తవానికి విటమిన్ సి లో 230శాతం కలిగి ఉంటుంది. అంతే కివీ తినడం వల్ల శరీరానికి సరిపడా విటమిన్ సి అందుతుంది. ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంతోపాటు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి పెంచుతుంది.
2. కివి గట్ బ్యాక్టీరియా:
కివీ జీర్ణక్రియను వేగవంతం చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. కడుపులో జీర్ణ ఎంజైమ్స్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో ఆహారం వేగంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
3. మలబద్ధకం సమస్య ఉండదు:
కివీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కివీని పొట్టుతో అలాగే తింటే…కడుపు జీవక్రియ రేటును పెంచుతుంది. మలబద్ధకం సమస్యను వేగంగా తగ్గించడంలో సహాయపడుతుంది.
4. కంటి చూపును మెరుగుపరుస్తుంది :
కివీ కంటి చూపును పెంచడంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కివిలో జియాక్సంతిన్, లుటిన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మీ కళ్ళకు ముఖ్యమైన పోషకమైన విటమిన్ ఎ ని తయారు చేయడంలో సహాయపడుతుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు రోజుకో కివీ తింటే ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందవచ్చు.