ఏపీ బడ్జెట్ కీలక అంశాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ బడ్జెట్ కీలక అంశాలు ఇవే..

March 11, 2022

11

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2022-23 ఏపీ వార్షిక బడ్జెట్‌ను రూ. 2,56,256 కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీ ముందుంచారు. ఇక ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు అని, మూలధనం వ్యయం రూ.47,996 కోట్లు అని స్పష్టం చేశారు. ఇక రెవెన్యూ లోటు రూ. 17,036 కోట్లుగా ఉంటుందని, ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లుగా పేర్కొంటూ మంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఏఏ శాఖలకు ఎంత కేటాయించారు. పథకాలకు ఎంత కేటాయించారు అనే విషయాలను ఆయన వెల్లడించారు.

బడ్జెట్ కేటాయింపులు..

1. వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ యోజన రూ.3,900 కోట్లు
2. వైఎస్సార్ ఉచిత పంట బీమా- రూ.1802 కోట్లు
3. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు- రూ.500 కోట్లు
4. రైతుభరోసా కేంద్రాలకు రూ.18 కోట్లు వ్యవసాయ, మార్కెటింగ్- ధరల స్థిరీకరణ నిధి- రూ.500 కోట్లు
5. వైఎస్సార్ వ్యవసాయ పరీక్షా కేంద్రాలు- రూ.50 కోట్లు
6. ఉచిత, రాయితీపై విద్యుత్ సరఫరా రూ.5000 కోట్లు
7. పశుసంవర్ధక, పాడి, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ. 1,568 కోట్లు
8. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాకు రూ.300 కోట్లు
9. వైద్య ఆరోగ్య- కుటుంబ సంక్షేమానికి 15,984 కోట్లు
10. వైఎస్సార్ ఆసరా రూ. 6400 కోట్లు
11. హోంశాఖకు రూ. 7,586 కోట్లు
12. వైఎస్సార్ సున్నా వడ్డీ రూ. 800 కోట్లు
13. వైఎస్సార్ చేయూత 4.235 కోట్లు
14. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు రూ.4,322 కోట్లు
15. వైఎస్సార్ పింఛను కానుక రూ.18,000 కోట్లు
16. వైఎస్సార్ బీమా రూ.372 కోట్లు
17. వైఎస్సార్ వాహన మిత్ర రూ. 200 కోట్లు
18. వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
19. జగనన్న తోడు రూ.25 కోట్లు
20. జగన్న చేదోడు రూ.300 కోట్లు
21. వైఎస్సార్ ఈబీసీ నేస్తం రూ. 590
22. వైఎస్సార్ లా నేస్తం రూ.15 కోట్లు
23. వైఎస్సార్ కాపు నేస్తం రూ.500 కోట్లు
24. ఎస్సీ సబ్ ప్లాన్‌కు రూ.18,518 కోట్లు
25. ఎస్టీ సబ్ ప్లాన్ కు రూ. 6,145 కోట్లు
26. బీసీ సప్లాన్‌కు రూ.29,143 కోట్లు
27.మైనార్టీ సంక్షేమానికి రూ.3,661 కోట్లు
28. కాపు సంక్షేమానికి రూ.3,537 కోట్లు
29. జగనన్న అమ్మ ఒడికి రూ. 6,500 కోట్లు
30. మనబడి నాడు, నేడు 3,500 కోట్లు
31. పాఠశాల విద్య రూ.27,700 కోట్లు
32. జగనన్న విద్యాదీవెనకు రూ.2,500 కోట్లు
33. జగనన్న వసతి దీవెనకు రూ.2,083 కోట్లు
34. ఉన్నత విద్య కోసం రూ.2,014 కోట్లు
35. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి రూ. 4,791కోట్లు
36. గ్రామీణాభివృద్ధికి రూ. 15,846 కోట్లు
37. పురపాలక, పట్టణాభివృద్ధికి రూ. 8,796 కోట్లు
38. నీటి వనరుల అభివృద్ధికి రూ. 11,482 కోట్లు
39. పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.2,755 కోట్లు
40. రవాణ, రోడ్లు, భవనాల శాఖకు రూ. 8,581కోట్లు
41. ఇంధన శాఖకు రూ. 10,281కోట్లు
42. నియోజకవర్గాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి రూ.350 కోట్లు