ఈ వారం థియేటర్లలో/ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వారం థియేటర్లలో/ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు ఇవే..

February 28, 2022

రెండు సంవత్సరాలపాటు కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగులకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. గతకొన్ని నెలలుగా కరోనా తగ్గుముఖం పడడంతో మళ్లీ సినిమా షూటింగుల జోరు ప్రారంభమైంది. దీంతో కొత్త సినిమాలు వారం వారం ఇటు థియేటర్లలో అటు ఓటీటీలో ద్వారా విడుదల అవుతూ, తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్‏టైన్మెంట్ అందిస్తున్నాయి. చిన్న సినిమాలే కాకుండా భారీ బడ్జెట్ చిత్రాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరీ ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఎంటో తెలుసుకుందామా..

1. శర్వానంద్, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. డైరెక్టర్ తిరుమల కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

2. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరీ నటించిన లేటేస్ట్ చిత్రం ‘హే సినామిక’. ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి సవాలక్ష కారణాలున్నాయి. కానీ కలిసి జీవించడానికి ఒకే ఒక్క కారణం ప్రేమ అంటూ మార్చి 3న థియేటర్లలో విడుదల కానుంది.

3. ఇటీవల ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సెబాస్టియన్ పీసీ 524’. కిరణ్ సరసన కోమలి ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే..

4. యంగ్ సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం డీజే టిల్లు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆహాలో మార్చి 4న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

5.తమిళ్ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ‘సామాన్యుడు’. ఈ మూవీ జనవరి 26న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పుడు మార్చి 4న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

6. ఇక అమెజాన్ ప్రైమ్‌లో.. నో టైమ్‌ టు డై – మార్చి 4 ద బాయ్స్‌ ప్రజెంట్స్‌ రానుంది. డయాబాలికల్‌ – మార్చి 4న అలాగే నెట్ ఫ్లిక్స్.. ఎగైన్స్‌ ద ఐస్‌ – మార్చి 2 ద వీకెండ్‌ ఎ వే – మార్చి 3 పీసెస్‌ ఆఫ్‌ హర్‌ (వెబ్‌ సిరీస్‌) – మార్చి 4 అవుట్‌లాండర్‌ ఆరో సీజన్‌ – మార్చి 7 డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. రుద్ర: ద ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ (హిందీ సిరీస్) మార్చి 4న రానున్నాయి.