ఈ వారం థియేటర్లలో/ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వారం థియేటర్లలో/ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు ఇవే..

March 21, 2022

 04

తెలుగు చిత్రసీమ పరిశ్రమతోపాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ పరిశ్రమలు వారం వారం కొత్త కొత్త సినిమాలను విడుదల చేస్తూ… అభిమానులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం థియేటర్లలో/ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు ఏవో తెలుసుకుందామా..

1. ‘ఆర్ఆర్ఆర్’

rrr01

తెలుగు చిత్రసీమ పరిశ్రమ నెం.1 దర్శకుడు రాజమౌళి ఆధ్వర్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుంది. ఎప్పుడెప్పుడు సినిమాను వీక్షించాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రానికి కీరవాణీ సంగీతాన్ని అందించారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు:

2. ‘భీమ్లా నాయక్’

పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలయింది. త్రివిక్రమ్ సంభాషణలు అందించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. సాగర్ కె. చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి 25 నుంచి ఈ చిత్రం ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీల్లో విడుదల కాబోతోంది.

3. ‘వలిమై’

తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వలిమై’ ఫిబ్రవరి 24 విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో కార్తికేయ నెగెటివ్ రోల్ లో నటించాడు. ఈ చిత్రం మార్చి 25న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.