ఈ వారం విడుదల కానున్న కొత్త సినిమాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వారం విడుదల కానున్న కొత్త సినిమాలు ఇవే..

March 14, 2022

06

పవర్ స్టార్ పూనీత్ రాజ్ కుమార్ నటించిన ఆఖరి చిత్రం ‘జేమ్స్’. డైరెక్టర్ చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తెలుగు హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించాడు. పూనీత్ అకాల మరణంతో దుఃఖంలో మునిగిపోయిన అభిమానులకు ఈ సినిమాతో మరోసారి అప్పును వెండితెరపై చూడబోతున్నారు. పూనీత్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న ఈ సినిమా విడుదలవుతుంది.

2. యంగ్ హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా ‘స్టాండప్ రాహుల్’. ఈ మూవీకి శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించగా.. నందకుమార్.. భరత్ మాగలూరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్. వీడియోస్ ఆసక్తిని పెంచాయి. జీవితంలో ఏ విషయానికి కూడా నిల్చువడానికి ఇష్టపడని యువకుడు స్టాండప్ కమెడియన్‌గా మారడం.. నిజమైన ప్రేమ ఎదురుకావడం ఈ రెండింటి కోసం ఎలా కష్టపడ్డాడు అనేది సినిమా. ఈ మూవీ మార్చి 18న విడుదల కానుంది.

3. నటుడు అమిత్ తివారి, భాను శ్రీ జంటగా నటించిన చిత్రం ‘నల్లమల్ల’. డైరెక్టర్ రవి చరణ్ తెరక్కెక్కించిన ఈ సినిమాలో నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ నటించారు. బానిస బతుకుల నుంచి భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న సమయంలో నల్లమల్ల అడవుల్లోకి మానవ రూపంలో ఉన్న క్రూరమృగం ప్రవేశించింది. ఆ మృగం వచ్చాక ఏం జరిగిందనేది ఈ సినిమమా. నల్లమల్ల మూవీ మార్చి 18న విడుదల కానుంది.

4. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమర్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ‘బచ్చన్ పాండే’. ఇందులో కృతి సనన్.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటించారు. డైరెక్ట్ర ఫర్హాద్ సామ్ జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ మూవీకి హిందీ రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది.

ఓటీటీలో వచ్చే సినిమాలు..

సెబాస్టియన్ పీసీ 524..

యంగ్ హీరో కిరణ్ అబ్బవంర నటించిన లేటేస్ట్ చిత్రం సెబాస్టియన్ పీసీ 524. రేచీకటి సమస్యతో బాధపడుతున్న కానిస్టేబుల్ అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కుని సస్పెండ్ కావడం.. తిరిగి అతను ఉద్యోగం ఎలా సాధించుకున్నాడనేది ఈ మూవీ. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో మార్చి 18న విడుదల కానుంది.

సెల్యూట్..

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటేస్ట్ చిత్రం సెల్యూట్. దుల్కర్ సల్మాన్ కు తెలుగులోనూ ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 18న ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

జల్సా..

బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రదాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం జల్సా.. సురేశ్ త్రివేణి దర్శకత్వం వహించిన ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలవుతుంది. మర్చి 18న అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ విడుదల కానుంది. ఇందులో విద్యాబాలన్ రిపోర్టర్ పాత్రలో నటిస్తోంది.

ఆహా.. జూన్ (తెలుగు సిరీస్).. మార్చి 18న

అమెజాన్ ప్రైమ్.. ఔటర్ రేంజ్.. మార్చి 15న డీప్ వాటర్.. మార్చి 18న మాస్టర్.. మార్చి 18న

నెట్ ఫ్లిక్స్.. టాప్ బాయ్. మార్చి 18న విండ్ ఫాల్.. మార్చి 18న క్రాకౌ మాన్ స్టర్స్.. మార్చి 18న బాడ్ వెగాన్.. మార్చి 16న

డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. లలితం సుందరమ్.. మార్చి 18న