ఇటీవలే విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ హవా ఇంకా కొనసాగుతుండగానే.. కొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. కొన్ని సినిమాలు థియేటర్లో, మరికొన్ని ఓటీటీలలో రిలీజవబోతున్నాయి. మరి ఈ వారంలో రిలీజయ్యే సినిమాల లిస్టు ఏంటో చూసేద్దాం.
1. రాధేశ్యామ్ : బాహుబలి స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా వచ్చిన ప్రేమకథా చిత్రం రాధేశ్యామ్. మార్చి 11న థియేటర్లలో రిలీజయి డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ సినిమా 20 రోజుల్లోనే ఓటీటీలో వస్తోంది. ఉగాదికి ముందు రోజు, ఏప్రిల్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవబోతోంది.
2. సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను నటించిన తాజా చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. యదార్ధ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల తీర్పు కోరబోతోంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవాలనుకునే ముగ్గురు పిల్లల కథాంశంతో ఈ సినిమా నిర్మించారు.
3. క్రికెట్ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. భారత క్రికెటర్ ప్రవీణ్ తాంబే జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ నిర్మించారు. ఏప్రిల్ 1న హాట్‌స్టార్‌లో రానున్న ఈ చిత్రంలో శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రలో నటించారు.
4. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ మలయాళ సినిమా జూన్‌ను హలో జూన్ పేరుతో తెలుగులో విడుదల చేస్తోంది. 2019లో విడుదలై విజయం సాధించిన ఈ చిత్రం ఏప్రిల్ 1 నుంచి ఆహాలో సందడి చేయబోతోంది.
5. ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా ఏప్రిల్ 2 నుంచి సోనీ లివ్‌లో అందుబాటులోకి రానుంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా చేసింది.
6. భీష్మపర్వం ఏప్రిల్ 1 నుంచి హాట్‌స్టార్‌లో విడుదలవుతుంది.
7. మూన్ నైట్ మార్చి 30 న హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
8. అమెజాన్ ప్రైమ్‌లో శర్మాజీ నమ్కీన్ మార్చి 31 విడుదల
ఇక, నెట్‌ఫ్లిక్స్‌లో హే సినామిక మార్చి 31న, స్టోరీస్ ఆఫ్ విట్ అండ్ మ్యాజిక్ అనే యానిమేషన్ టీవీ షో – మార్చి 31, ది లాజ్ బస్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 1 న స్ట్రీమింగ్ అవనుంది.