These are the new judges of Telangana High Court.
mictv telugu

తెలంగాణ హైకోర్ట్ కొత్త జడ్జిలు వీళ్లే..

July 26, 2022

తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం న్యాయవాదులుగా విధులు నిర్వహిస్తున్న.. ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేశ్ భీమపాక, పుల్ల కార్తీక్ (పి.యలమందర్), కాజ శరత్, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజే శ్వరావు అనే ఆరుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం భేటీ అయి ఈ నిర్ణయం తీసుకుంది. వీరి నియామకాలకు త్వరలోనే రాష్ట్రపతి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

 

తెలంగాణ హైకోర్టులో 42 మంది న్యాయమూర్తులు ఉండాలి కానీ, ప్రస్తుతం 27 మంది పనిచేస్తున్నారు. 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొలీజియం సిఫార్సు చేసిన ఈ ఆరుగురి నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఖాళీల సంఖ్య 9కి తగ్గుతుంది. సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణతోపాటు హిమాచల్ ప్రదేశ్ (2), ఒడిశా (3), గువాహటి (2), కోల్‌కతా (0), పంజాబ్, హరియాణా (13) హైకోర్టులకు కలిపి మొత్తం 35 మంది పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ నెల 19వ తేదీన కర్ణాటక హైకోర్టు (5), అలహాబాద్ హైకోర్టు (9), 20న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (7)కు చేసిన సిఫార్సులను కూడా కలిపితే గత ఐదు రోజుల్లో 9 హైకోర్టులకు 56 పేర్లను సిఫార్సు చేసినట్లయింది.

కొత్త న్యాయమూర్తులు వీరే..