1. ‘రామరావు ఆన్ డ్యూటీ’
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా, దివ్యాంశ కాళి, రజిష విజయన్ హీరోయిన్స్‌గా దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించిన చిత్రం ‘రామరావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 29న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి.
2. ‘విక్రాంత్ రోణ’
కన్నడ స్టార్ సుదీప్ కిచ్చా హీరోగా, నిరుప్ భండారీ, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు హీరోయిన్స్‌గా నటించిన తాజా చిత్రం ‘విక్రాంత్ రోణ’. ఈ సినిమాను దర్శకుడు అనుప్ భండారి తెరకెక్కించారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రేపు విడుదలకానుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ‘రారా రక్కమ్మ’ పాట సంచలనం సృష్టిస్తుంది.
3. ‘ద లెజెండ్’
చిత్రం పేరు ద లెజెండ్. అరుళ్ శరవణన్ హీరోగా, ఊర్వశి రౌటిల హీరోయిన్గా దర్శకుడు జెడీ జెర్రీ తెరకెక్కించారు. ఈ చిత్రం అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈనెల 28వ ఐదు బాషల్లో విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు, ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైయ్యాయి.
4. ‘రాకెట్రీ’
తమిళ హీరో ఆర్. మాధవన్ హీరోగా, సిమ్రన్ హీరోయిన్గా తాజాగా విడుదలైన చిత్రం ‘రాక్రెటీ’ ఈ సినిమాకు దర్శకత్వం కూడా ఆర్. మాధవన్‌నే. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది.
5. ‘గుడ్ లక్ జెర్రీ’
జాన్వీకపూర్, దీపక్ దొబ్రియల్, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ తదితరులు నటించిన చిత్రం ‘గుడ్ లక్ జెర్రీ’. ఈ సినిమాకు సంగీతం అందించింది పరాగ్ చబ్రా, అమన్ పంత్, ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్ సేన్ గుప్త తెరకెక్కించారు. డిస్నీ+హాట్ స్టార్ వేదికగా 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నెటిప్లెక్స్
1. డ్రీమ్ హోమ్ మేకోవర్ (వెబ్ సిరీస్) జులై 27
2. ద మోస్ట్ హేటెడ్ మ్యాన్ ఆన్ ది ఇంటర్నెట్ (వెబ్ సిరీస్) జులై 27
3. కీప్ బ్రీతింగ్ (వెబ్ సిరీస్) జులై 28