టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ పరిశ్రమలు కరోనా, లాక్డౌన్ తర్వాత మళ్లీ వేగం పెంచాయి. వారం వారం కొత్త కొత్త సినిమాలను అటు థియేటర్స్‌లో ఇటు ఓటీటీలో విడుదల చేస్తూ, సినీ ప్రియులను తెగ అలరిస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు బాక్సాఫీసు వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబట్టి, నెం.1 స్థానంలో చోటుదక్కించుకున్నాయి. ఈ క్రమంలో ఈవారం విడుదల అవుతున్న కొత్త సినిమాల లిస్ట్ ఎమిటో చూద్దామా..
1. ‘ది వారియర్’
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా, కృతిశెట్టి హీరోయిన్గా, ఆది పినిశెట్టి, అక్షరా గౌడ, నదియ తదితరులు నటించిన తాజా చిత్రం..ది వారియర్’. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించగా, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సమకుర్చాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్లు పూర్తయ్యాయి. ఇక, ఈ సినిమా తెలుగు,తమిళంలో ఈనెల 14న విడుదలకు సిద్దమైంది. ఈ సినిమాలో రామ్ పోతినేని మొదటిసారిగి పోలీస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు.
2. ‘అమ్మాయి’
టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాం గోపాల్ వర్శ తెరకెక్కించిన తాజా చిత్రం.. అమ్మాయి (డ్రాగన్ గర్ల్). ఈ సినిమా దేశవ్యాప్తంగా ఈనెల 15న తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో విడుదలైంది. ఈ చిత్రంలో పూజా భలేకర్, అభిమన్యు సింగ్, మియా ముఖి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం పాల్ ప్రవీణ్ అందించారు.
ఓటీటీలో వస్తున్న సినిమాలు..
3. ‘సమ్మతమే’
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్గా చాందినీ చౌదరి నటించిన తాజా చిత్రం..సమ్మతమే. ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో విడుదలై, మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు గోపినాథ్ రెడ్డి తెరకెక్కించగా, సంగీతాన్ని శేఖర్ చంద్ర అందించారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఆహాలో ఈ నెల 15నుంచి స్ట్రీమింగ్ కానుంది.
4. ‘మా నీళ్ల ట్యాంక్’
మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్‌లో టాలీవుడ్ నటుడు సుశాంత్, ప్రియా ఆనంద్, సుదర్శన్, ప్రేమ్ సాగర్, నిరోష తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్‌ను దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తెరకెక్కించగా, సంగీతాన్ని నరేన్ ఆర్కే సిద్ధార్థి అందించారు. ఈ నెల 15నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
5. ‘గార్గి’
టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ సాయిపల్లివి కీలకపాత్రలో నటించిన తాజా చిత్రం ‘గార్గి’. ఈ చిత్రంలో సాయి పల్లవితోపాటు కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ తెరకెక్కించగా, సంగీతం గోవింద్ వసంత్ అందించారు. ఆ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది.
6. అమెజాన్ ప్రైమ్జ..
1. కామిక్ స్టోన్ (రియాల్టీ షో) జులై 15
7. నెటిప్లెక్స్
1. కుంగ్ ఫూ పాండా జులై 14