These are the new movies releasing this week..
mictv telugu

ఈవారం విడుదల అవుతున్న కొత్త సినిమాలు ఇవే..

July 18, 2022

తెలుగు సినిమాలతోపాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు సంబంధించిన కొత్త సినిమాలు వారం వారం అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో విడుదలై, ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. కరోనా కారణంగా రెండు సంవత్సరాలపాటు షూటింగులు జరగక, కొత్త సినిమాలు తెరకెక్కించక నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు నానా అవస్థలు పడ్డారు. కరోనా ముగిసిపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా షూటింగులకు పర్మిషన్ ఇవ్వడంతో మళ్లీ ఇండస్ట్రీలు కళకళలాడుతున్నాయి. వారం వారం కొత్త సినిమాలను విడుదల చేస్తూ, ప్రేక్షకులను ఆనందింపజేస్తున్నాయి. మరి అలస్యం చేయకుండా ఈ వారం థియేటర్లలో ఏ కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయో తెలుసుకుందామా..

1.”థ్యాంక్యూ”

 

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా, రాశీఖన్నా హీరోయిన్‌గా దర్శకుడు విక్రమ్ కూమార్ తెరకెక్కించిన తాజా చిత్రం ”థ్యాంక్యూ”. ఈ చిత్రానికి సంబంధించి టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదలై, మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ థ్యాంక్యూ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ఈనెల 22న విడుదలకు సిద్దమైంది.

2. ”షంషేరా”

 

బాలవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా, వాణికపూర్ హీరోయిన్‌గా దర్శకుడు కరణ్ మల్హోత్ర తెరకెక్కించిన చిత్రం షంషేరా. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ఈనెల 22న విడుదలకు సిద్దమైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.

3. హైయ్ ఫైవ్

టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హైయ్ ఫైవ్. ఈ చిత్రంలో అమ్మ రాజశేఖర్ మెయిన్ పాత్రలో నటించగా, సుధీర్, సమీర్, మన్నార చోప్రా తదితరులు నటించారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా ఈనెల 22న విడుదలకు సిద్దమైంది.

4. దర్జా

జబర్థస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ..పలు సినిమాలో కీలకపాత్రలు చేస్తూ, ప్రేక్షకుల్లో మంచి పేరును సంపాదించుకుంది. తాజాగా అనసూయ, యాక్టర్ సునీల్ ప్రముఖ పాత్రల్లో నటించిన దర్జా చిత్రం ఈ నెల 22 విడుదలకు సిద్దమైంది. ఈ సినిమాను దర్శకుడు సలీమ్ మాలిక్ తెరకెక్కించగా, ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందించాడు.

ఓటీటీలో వస్తున్న సినిమాలు..

5. సోనీలివ్..
డాక్టర్ ఆరోరా (హిందీ సిరీస్) ఈ నెల 22
ఎఫ్3 (తెలుగు) ఈనెల 22
మీమ్ బాయ్స్ (తమిళ్) ఈ నెల 22

6. నెటిప్లిక్స్
ఇండియన్ ప్రిడేటర్ (హిందీ) జూలై 20
ఎఫ్3 (తెలుగు) జూలై 22
ద గ్రే మ్యాన్ తెలుగు డబ్బింగ్ ఈనెల 22

7.ఆహా
ఏజెంట్ ఆనంద్ సంతోష్ (తెలుగు సిరీస్) జూలై 22