These are the new movies releasing this week.
mictv telugu

ఈ వారం విడుదల అవుతున్న కొత్త సినిమాలు ఇవే..

August 8, 2022

1. ‘లాల్ సింగ్ చడ్డా’

బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను అద్వైత్ చందన్ తెరకెక్కిస్తున్న ఈ కామెడీ డ్రామాలో యువ నటుడు నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. వైవిధ్య పాత్రలో మెప్పించే ఆమిర్ నుంచి వస్తున్న సినిమా కావటం, నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అలాగే, తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

2-”కార్తీకేయ

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్-చందూ మొండేటి కాంబినేషన్ వచ్చిన గత చిత్రం ‘కార్తికేయ’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మరో తాజా చిత్రం ‘కార్తికేయ 20’. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. వీరితోపాటు శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాలి కానీ, ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆగస్టు 18న ‘కార్తికేయ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

3. ‘మాచర్ల నియోజకవర్గం’

తెలుగు యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా ఎం. ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా కృతిశెట్టి, కేథరిన్ నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పాటలు, ట్రైలర్ మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. అంజలి ఐటమ్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోన్న విషయం తెలిసిందే.

4. ‘రక్షాబంధన్’

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రక్షాబంధన్’. ఈ సినిమాను దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ తెరకెక్కించాడు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా మొత్తం ఫ్యామిలీ డ్రామాగా రూపొందించారు. ఇందులో నలుగురు అక్కా చెల్లెళ్లకు లాల్ కేదార్‌నాథ్ (అక్షయ్) అన్నయ్యగా వ్యహరించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటలు మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి.

4. నెట్‌ప్లిక్స్..
1. నరూటో: షిప్పుడెన్ సీజన్-1 ఆగస్టు 8
2. హ్యాపీ బర్త్ డే (తెలుగు) ఆగస్టు 8
3. ఐ జస్ట్ కిల్డ్ మై డాడ్ (హాలీవుడి) ఆగస్టు 9
4. ఇండియన్ మ్యాచ్ మేకింగ్ సీజన్ 2 (వెబ్ సిరీస్) ఆగస్టు 10.
5. లాకీ అండ్ కీ సీజన్-3 (వెబ్ సిరీస్) ఆగస్టు 10
6. బ్యాంక్ రాబర్స్: ది లాస్ట్ గ్రేట్ హెయిస్ట్ (హాలీవుడ్) ఆగస్టు 10

5. డీస్నీ ప్లస్ హాట్‌స్టార్..
ది వారియర్ (తెలుగు/తమిళ్) ఆగస్టు 11

6. అమెజాన్ ఫ్రైమ్..
1. సోనిక్ ది ఎడ్జ్‌హాగ్2 (హాలీవుడ్) ఆగస్ట్ 10
2. ది లాస్ట్ సిటీ (హాలీవుడ్) ఆగస్ట్ 10
3. మలయాన్ కుంజు (మలయాళం) ఆగస్ట్ 11
4. ఎ లీగ్ ఆఫ్ దైర్ వోన్ (హాలీవుడ్) ఆగస్ట్ 12
5. కాస్మిక్ లవ్ (హాలీవుడ్) ఆగస్ట్ 12
సోనీ లివ్..
6. గార్గి (తెలుగు) ఆగస్ట్ 12
7. ఆహా..
మాలిక్ (తెలుగు) ఆగస్ట్ 12