మార్చిలో రానున్న కొత్త ఫోన్లు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

మార్చిలో రానున్న కొత్త ఫోన్లు ఇవే..

February 28, 2022

iphone

ఫోను ప్రియులకు ఆయా కంపెనీలు శుభవార్తను తెలిపాయి. ఆత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన తమ కంపెనీ ఫోన్లను మార్చి నెలలో విడుదల చేస్తున్నామని వెల్లడించాయి. ఈ సందర్భంగా ఏఏ కంపెనీలు, ఏఏ ఫోన్స్ విడుదల చేస్తున్నాయి.? ప్యూచర్స్ ఎంటీ..? ఎంత ధర..? ఆ ఫోన్స్ ప్రత్యేకతలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందామా..

1. ఐఫోన్ ఎస్ఈ 3 (iPhone SES)

మార్చి రెండు లేదా మూడో వారంలో ఐఫోన్ ఎస్ఈి విడుదలకానుందని సమాచారం. ఇందులో ఏ 15 బయోనిక్ చిప్ సెట్‌ను ఉపయోగించారు. 4.7 అంగుళాల హెచ్ డీ రెటీనా డిస్ ప్లే, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇస్తున్నారు. ఈ ఫోన్లో క్వాల్కమ్ ఎక్స్ 60 5జీ మోడెమ్‌ను ఉపయోగించారు. ఐఓఎస్ 15తో పని చేస్తుంది. టచ్ ఐడీ, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఎస్ఈ 3లో రెండు కెమెరాలుంటాయి. వెనుక 12ఎంపీ, ముందు ఎంపీ కెమెరాలు ఇస్తున్నారట. మొబైల్ ధర రూ.30 వేల నుంచి రూ.35 వేల మధ్య ఉంటుందని సమాచారం.

2. శాంసంగ్ ఎమ్ 38 5జీ (Samsung M33 5G)

మార్చి నాలుగో వారంలో శాంసంగ్ ఎమ్ 33 5జీ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 6.46 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ ప్లే ఇస్తున్నారు. ఎగ్జినోస్ 1200 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుక 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 8 ఎంపీ అలా-వైడ్ యాంగిల్, 5 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందువైపు 13 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.0 ఓఎతో పనిచేస్తుంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. 6 జీబీ/8 జీబీ ర్యామ్ వేరియంట్లలో తీసుకొస్తున్నారు. ధర విషయాలు తెలియాల్సి ఉంది.

3. వివో టీ1 ప్రో (Vivo Tl Pro)

టీవీ సిరీలో రెండు మోడలను వివో భారత మార్కెట్లోకి ఇప్పటికే విడుదల చేసింది. మార్చిలో టీ1 ప్రో సిరీస్లో 4జీ, 3జీ మోడలను తీసుకురానుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు మూడు, ముందు రెండు కెమెరాలుంటాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 8 జీబీ/ 12 జీబీ ర్యామ్ వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్లో ఈ ఫోన్ పనిచేస్తుందట.

4. ఒప్పో ఎఫ్ 21 సిరీస్ (Oppo F 21 Series)

ఎఫ్ సిరీస్లో రెండు మోడలను మార్చి రెండో వారంలో ఒప్పో విడుదల చేయనుంది. ఎఫ్ 21 పేరుతో వస్తున్న ఈ ఫోన్లలో స్నా డ్రాగన్ 720జీ 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.43 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ఈ మొబైల్ ప్రారంభ ధర రూ. 20 వేలు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ మొబైల్ కు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

5. వన్‌ప్లస్ 10 ప్రో 5జీ (OnePlus 10 Pro 5G)

వన్ ప్లస్ నుంచి మరో 5జీ మొబైల్ విడుదల కానుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 6.7 అంగుళాల 2k డిస్ ప్లేతో వన్ ప్లస్ 10 ప్రో 5జీ మొబైల్ తీసుకొస్తున్నారు. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 5జీ ప్రాసెసర్. 50 ఎంపీ హేజల్ క్లౌడ్ కెమెరాలున్నాయి. మార్చి మూడో వారంలో ఈ మొబైల్ విడుదలవుతున్నట్లు సమాచారం. దీంతోపాటు వప్లస్ నార్డ్ సీఈ సిరీస్ లో మరో కొత్త మోడల్ కూడా వస్తుందని సమాచారం . వప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ (OnePlus Nord CE 2 Lite) పేరుతో ఈ మొబైల్ తీసుకొస్తారట. ఇందులో 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.48 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఇస్తున్నారు. స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. మార్చి మూడో వారంలో ఈ స్మార్ట్ ఫోన్ విడుదలకానుంది.