These are the Places where Rahul Yatra will be held in Telangana..
mictv telugu

తెలంగాణలో రాహుల్ యాత్ర జరిగే ప్రాంతాలివే..

October 23, 2022

తెలంగాణలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎంట్రీ ఇచ్చింది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణ మండలం గూడబల్లూరు దగ్గర తెలంగాణలోకి ప్రవేశించారు రాహుల్‌గాంధీ. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు శ్రీధర్‌బాబు సహా పలువురు టీకాంగ్రెస్‌ నేతలు. టైరోడ్‌ వరకు 3 కిలోమీటర్ల పాటు పాదయాత్ర కొనసాగనుంది. మహబూబ్‌నగర్‌-రాయచూర్‌ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ మక్తల్ నియోజకవర్గంలోకి యాత్ర అడుగుపెట్టినా మధ్యాహ్నం తర్వాత బ్రేక్‌ తీసుకుంటున్నారు రాహుల్‌.

రాష్ట్రంలో రాహుల్ యాత్ర ఇలా..
– నారాయణపేట జిల్లాలోని మక్తల్‌ నియోజకవర్గంలో అడుగుపెట్టే రాహుల్‌ యాత్ర.. నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌ నగర్, రాజేంద్రనగర్, బహుదూర్‌పురా, చార్మినార్, గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్‌ఖేడ్, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా (ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్‌ జిల్లాల్లో) సాగనుంది.

– హైదరాబాద్‌లో ఆరాంఘర్, చార్మినార్, మోజంజాహి మార్కెట్, గాంధీభవన్, నెక్లెస్‌ రోడ్, బోయిన్‌పల్లి, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెరు ప్రాంతాల మీదుగా జరుగుతుంది.

సెప్టెంబర్‌ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన జోడో యాత్ర కేరళ, కర్ణాటక, ఏపీ, తిరిగి కర్ణాటక మీదుగా 45 రోజులుగా రాహుల్‌ పాదయాత్ర సాగుతోంది. ఇప్పటివరకు సుమారు 2,325 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. తెలంగాణలో విరామాలు సహా మొత్తం 16 రోజుల పాటు 375 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.