These are the properties of Krishnam raju
mictv telugu

రాజభవనంతో పాటు కృష్ణం రాజుకు ఎంత ఆస్తి ఉందో తెలుసా?

September 13, 2022

These are the properties of Krishnam raju

తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహీరోగా రాణించిన రెబల్ స్టార్ కృష్ణం రాజు సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. దాదాపు 60 ఏళ్లకు పైగా రారాజుగా వెలిగిన ఆయన ఆదివారం మరణించిన విషయం తెలిసిందే. దీంతో కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య జరిగిన అంత్యక్రియలు సోమవారం ఆయన ఫాం హౌస్‌లో పూర్తయ్యాయి.

అటు సంపన్న కుటుంబంలో జన్మించని ఆయన సాధారణ వ్యక్తుల్లా అవకాశాల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో పస్తులున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చిన రెబల్ స్టార్ వారసత్వంగా ఆస్తులు బాగా వచ్చాయట. అంతేకాక సినిమాల్లో కూడా బాగానే సంపాదించారంట. ఆయన మరణానంతరం చర్చనీయాంశమవుతున్న ఆయన ఆస్తుల చిట్టా ఇది అని చెప్పుకుంటున్నారు. ఏలూరు జిల్లా మొగల్తూరులో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వందల ఎకరాల భూములు ఉన్నాయి. వాటిని ప్రస్తుతం ఆయన సమీప బంధువులు చూసుకుంటున్నారు. అలాగే అక్కడే ఆయన పేరు మీద రాజభవనం కూడా ఉంది. ఇక జూబ్లీహిల్స్‌లో నివాసముంటున్న భవనం ఖరీదు రూ. 18 కోట్లుంటుందని అంచనా. ఇది కాక చెన్నైలో ఇల్లుతో పాటు పలు ఆస్తులు ఉన్నాయి. కార్ల విషయానికి వస్తే 90 లక్షల మెర్సిడెజ్ బెంజ్, 40 లక్షల టొయోటా ఫార్చునర్, 90 లక్షల వోల్వో ఎక్స్ సీ కార్లు ఉన్నాయి. వీటన్నింటిని కలిపితే మొత్తం ఆస్తి విలువ 200 నుంచి 300 కోట్లు ఉంటుందని చెప్తున్నారు.