These are the some Vastu tips can bring prosperity in your business.
mictv telugu

బిజినెస్‌లో నష్టాలా.. అయితే వాస్తురీత్యా ఈ లోపాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి..!!

January 6, 2023

జీవితంలో ఆనందం,శ్రేయస్సు, విజయం పొందాలంటే…వాస్తు అవసరం. కొన్ని ప్రత్యేక వాస్తు చిట్కాలను అనుసరించినట్లయితే..మీరు చేస్తున్న పనిలో విజయం సాధించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడి పనిచేసినా సరైన ప్రతిఫలం లభించదు. అయితే కొన్ని వాస్తు చిట్కాలను అనుసరించడం వల్ల వ్యాపారంలో శ్రేయస్సును ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.

వాయువ్య, ఈశాన్య దిశలు:

వాస్తుప్రకారం వాయువ్య, ఈశాన్య దిశలు సానుకూల శక్తిని లోపలికి తీసుకువచ్చేందుకు సహాయకారిగా ఉంటాయి. ఈ దిశలో కార్యాలయ ప్రధాన ద్వారం నిర్మించినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో మీ ఆఫీసులోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.

ఆఫీసు రిసెప్షన్ :

ఏ ఆఫీసులోనైనా సరే రిసెప్షన్ రద్దీగా ఉంటుంది. ప్రతిరోజూ ఎంతో మంది వ్యక్తులు వస్తుంటారు. కాబట్టి ఆఫీసు వాతావారణాన్ని సానుకూలంగా ఉంచడం చాలా ముఖ్యం. అక్కడికి వచ్చిన ప్రతిఒక్కరూ సానుకూల అనుభూతి చెందుతారు. వాస్తు ప్రకారం…ఆఫీస్ రిసెప్షన్ ప్రాంతం ఈశాన్యం లేదా తూర్పుదిశలో ఉండాలి. కూర్చుకోవడానికి సౌకర్యవంతమైన కుర్చీ, సోఫా ఉండాలి.

ఉద్యోగులకు సౌకర్యవంతంగా:

 

వ్యాపారం విజయవంతం కావాలంటే ఉద్యోగుల సహకారం చాలా అవసరం. ఉద్యోగులు తమ బిజీ షెడ్యూల్ నుంచి విశ్రాంతి తీసుకోవడం, లేదా కాఫీ తాగడానికి ఆఫీసులో సౌకర్యవంతమైన లాంజ్‎ను కలిగి ఉండటం చాలా ముఖ్యం.

హెచ్‎ఆర్ విభాగం:

 

ఆఫీసులో హెచ్‎ఆర్ విభాగం విభాగం ఆగ్నేయంలో ఉండటం చాలా మంచిది. ఉద్యోగులు పనిచేసేటప్పుడు ఉత్తరం లేదా తూర్పు వైపు చూసేలా ఉండటం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం..ఈ మార్పులు చేయడం వల్ల మీ వ్యాపారంలో పురోగతి ఉంటుంది.