వందలోపు పెట్రోల్ ధరలున్న రాష్ట్రాలు ఇవే - MicTv.in - Telugu News
mictv telugu

వందలోపు పెట్రోల్ ధరలున్న రాష్ట్రాలు ఇవే

May 23, 2022

భారీగా పెరిగిన చమురు ధరలను కేంద్రం గత వారం కొంత తగ్గించి కొంత ఊరట కల్పించిన విషయం తెలిసిందే. పెట్రోల్ రూ. 8, డీజిల్ రూ. 6 లను తగ్గించింది. దీంతో కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు వంద రూపాయలలోపు చేరుకున్నాయి. చండీగఢ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.20, డీజిల్ ధర రూ. 84.26కి తగ్గాయి.

పంజాబులో లీటరు పెట్రోల్ ధర రూ. 96, ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.41, గుజరాత్‌లో పెట్రోల్ ధర రూ. 99.80, హర్యానాలో రూ. 98.50, అస్సాంలో రూ. 96, జమ్ము కాశ్మీర్ రూ. 99.80, ఉత్తరాఖండ్ రూ. 94.80, జార్ఖండ్ రూ. 99.50లుగా ఉన్నాయి. కాగా, కేంద్రం సెస్ తగ్గించిన నేపథ్యంలో దాదాపు లక్ష కోట్ల రూపాయల ఆదాయం కేంద్ర ప్రభుత్వం కోల్పోతుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు కోల్పోతున్న ఆదాయాన్ని మార్కెట్‌లో అప్పుల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.