ఇక నుంచి ఫేస్‌బుక్‌లో ఈ ఫీచర్లు ఉండవు - MicTv.in - Telugu News
mictv telugu

ఇక నుంచి ఫేస్‌బుక్‌లో ఈ ఫీచర్లు ఉండవు

May 9, 2022

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఫేస్‌బుక్ సంస్థ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. ‘నియర్ బై ఫ్రెండ్స్’, ‘వెథర్ అలర్ట్’ అనే రెండు ఫీచర్లను మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఈ రెండు ఫీచర్ల సేవలు మే 31వరకే మాత్రమే అందుబాటులో ఉంటాయని, ఆ తర్వాత వీటి వాడకాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్లకు సంబంధించి, ఫేస్‌బుక్ యాప్ ద్వారా యూజర్లకు ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా పంపించినట్లు వెల్లడించింది.

“నియర్ బై ఫ్రెండ్స్’, వెథర్ అలర్ట్ ఫీచర్లను 2014లో ప్రారంభించాం. అప్పటినుంచి ఈ ఫీచర్ల ద్వారా పలు సేవలు అందిస్తూ, వచ్చాం. మే 31 తర్వాత ఇవి అందుబాటులో ఉండవు. వీటితోపాటు లోకేషన్ హిస్టరీ, బ్యాక్‌గ్రౌండ్ లోకేషన్ వంటి సేవలు కూడా నిలిచిపోతాయి. ఇప్పటివరకు ఇందులో సేవ్ అయిన డేటా డిలీట్ అవుతుంది” అని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

మరోపక్క ఫేస్‌బుక్ సంస్థ 2004 ఫిబ్రవరిలో తమ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆరంభించిన కొద్ది కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600ల మిలియన్లకు పైగా వినియోగదారులు ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. అంచలంచెలుగా అభివృద్ది చెందుతూ, ఎప్పటికప్పుడు వినియోగదారులకు పలు ఫీచర్లను అందుబాటులోకి తీసుకోస్తోంది. ఈ క్రమంలో 2014లో ‘నియర్ బై ఫ్రెండ్స్’ ఫీచర్‌ను ఫేస్‌బుక్ ప్రారంభించింది. మొదట్లో యూజర్లకు ప్రైవసీ సమస్యలు తలెత్తాయి. అయినా ఇప్పటివరకూ ఫేస్‌బుక్ యాప్‌లో అందుబాటులో ఉంచింది. ఇప్పుడు వీటిని పూర్తిగా తొలగించాలనీ కీలక నిర్ణయం తీసుకుంది.