డబ్బు…ఎప్పుడు ఎవరికి…ఏవిధంగా ఉపయోగపడుతుందో చెప్పలేం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం డబ్బు లేకుంటే కష్టం. ఈ మధ్య కాలంలో బహుళజాతి కంపెనీలన్నీ కూడా పెద్దెత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. కాబట్టి ఎవరి ఏ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతుయో చెప్పలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు మీకు ఎదురుకాకుండా ఉండాలంటే ప్రతినెలా ఆదాయంలో కొంత భాగాన్ని అత్యవసర నిధికి కేటాయించుకోవాలి. ఇలా చేస్తే అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డులు, రుణాలు తీసుకోవల్సిన అవసరం ఉండదు. వైద్య ఖర్చులతోపాటు ఇతర ఊహించన ఖర్చలను సులభంగా తీర్చుకోగలుగుతారు. అయితే తక్కువ ఆదాయం తక్కువగా ఉన్న డబ్బును ఆదా చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే పెరుగుతున్న నిత్యవసరాలకే వచ్చిన ఆదాయం సరిపోతే…జమ చేయడం ఎలా? ఇది పెద్ద ప్రశ్నే. అయితే ఆదాయం తక్కువగా ఉన్న వారు…చిన్న మొత్తంలో పొదుపు చేయడం ప్రారంభిస్తే…దీర్ఘకాలంలో పెద్ద మొత్తం పోగుచేస్తారు. ఆదాయం ఎంత తక్కువగా ఉన్నా…అందులో కొంత పక్కన పెట్టండి. ఖర్చులను తగ్గించుకోండి. అత్యవసర సమయాల్లో డబ్బును ఎలా సేకరించాలి. ఎలాంటి మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం.
1. చిన్న మొత్తాలలో పొదుపు చేయడం:
ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును పోగు చేయడం చాలా కష్టమైన పని. చిన్న మొత్తంలో పొదుపు చేయాలి. నెలకు వెయ్యి రూపాయలు పొదుపు చేస్తే…ఆదాయం పెరిగే కొద్దీ ఈ మొత్తాన్ని పెంచుకోవచ్చు.
2.ఆటోమేటిక్ సేవింగ్స్:
ప్రతిసారీ మీ జీతం ఖాతా నుండి డబ్బును మాన్యువల్‌గా పొదుపు ఖాతాకు బదిలీ చేయడానికి బదులుగా, ఆటోమేటిక్ బదిలీని ఏర్పాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల , ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది.
3. అనవసరమైన ఖర్చులను తగ్గించండి :
హోటళ్లు, సినిమాలు, విందులు వినోదాలు, ప్రతివారం బయటకు వెళ్లడం, ఇలాంటి ఖర్చులను సాధ్యమైనంత వరకు తగ్గించండి. మీ అత్యవసర నిధి మొత్తాన్ని పెంచుకోవడానికి ఈ డబ్బును ఉపయోగిస్తే భవిష్యత్తులో మీ అవసరాలకు ఉపయోగపడుతుంది.
4. ఎర్న్ ఎక్స్ట్రా మనీ:
ఉద్యోగం కాకుండా అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ఇతర మార్గాల గురించి ఒకసారి ఆలోచించండి. ఫ్రీలాన్స్ వర్క్ చేయడం లేదా ఇంట్లో వస్తువులను తయారు చేసి అమ్మడం లేదా మీకు నృత్యం లేదా సంగీతం తెలిసినట్లయితే తరగతులు నిర్వహించడం ద్వారా కొంత ఆదాయాన్ని పొందడం కూడా సాధ్యం అవుతుంది. అభిరుచిని ఆదనపు ఆదాయంగా మార్చుకునేందుకు నేడు చాలా అవకాశాలు ఉన్నాయి.
5. రికరింగ్ డెఫిసిట్ ఖాతా తెరవండి:
పోస్టాఫీసుతోపాటుగా కొన్ని బ్యాంకులలో RD ఖాతాను తెరవడం సాధ్యమవుతుంది . మీరు ఈ ఖాతాలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఆర్డీ ఖాతాలోని డబ్బుపై కూడా మంచి వడ్డీ వస్తుంది. ప్రతి నెలా ఈ ఖాతాలో నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా వడ్డీతో సహా మీ అత్యవసర నిధి తయారు చేయబడుతుంది.
ఉద్యోగం ఊడిపోయాయని చింతించకుండా…దీపం ఉన్నప్పుడే ఇల్లును సరిదిద్దుకోవడం మంచిది. అనవసర ఖర్చులను తగ్గించుకుని భవిష్యత్తుపై ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతే..కష్ట కాలంలోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు.