పిల్లలకు ఈ ఫుడ్స్ చాలా డేంజర్.. వారిలో ఊబకాయన్ని పెంచుతాయి..!! - Telugu News - Mic tv
mictv telugu

పిల్లలకు ఈ ఫుడ్స్ చాలా డేంజర్.. వారిలో ఊబకాయన్ని పెంచుతాయి..!!

March 3, 2023

నేటికాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఊబకాయ సమస్యను ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఇవన్నీకూడా ఊబకాయానికి దారి తీస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా జంక్ ఫుడ్ కు అలవాటు పడటంతో చిన్నతనంలో అధిక బరువును మోస్తున్నారు. కానీ ఊబకాయం సమస్య ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో తయారు చేసిన ఆహారం మాత్రమే పిల్లలకు ఇవ్వాలని సూచిస్తున్నారు. ప్రపంచంలో ఊబకాయంతో బాధపడుతున్నవారి సంఖ్య మూడు రెట్టు పెరిగిందని డబ్ల్యూహెచ్ ఓ వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 2020 సంవత్సరంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 39 మిలియన్ల మంది పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారని వెల్లడించింది. పిల్లల్లో ఊబకాయానికి ఆహారమే కారణమనడంలో సందేహం లేదు. మరి పిల్లల్లో స్థూలకాయానికి ఎలాంటి ఆహారపదార్థాలు కారణమవుతుందో తెలుసుకుందాం.

1. బంగాళదుంప చిప్స్:

రంగురంగుల ప్యాకెట్లలో వచ్చే బంగాళదుంప చిప్స్ పిల్లలకు చాలా ఇష్టం. వాటిని అస్సలు అలవాటు చేయవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. చిప్స్‌లో కేలరీలు అధికంగా ఉంటాయి, ఉప్పు, అసంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి హానికలిగిస్తాయి.

2.టోఫీలు:

టోఫీలు, చాక్లెట్లు, స్వీట్లు వంటివి పిల్లలకు చాలా ఇష్టం. చాలా మంది తల్లులు పిల్లలకు ఇవి ఇస్తుంటారు. చదువుకుంటే చాక్లెట్ ఇస్తానంటూ అస్సలు చెప్పకూడదు. చాక్లెట్ తినే వ్యసనం మీ పిల్లలను ఊబకాయం వైపు నడిపించడమే కాకుండా, వారి దంతాలను కూడా పాడు చేస్తుంది.

3. ఐస్ క్రీమ్:

పిల్లలకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఐష్ క్రీమ్ కనపడితే చాలు లాగేస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఐస్ క్రీంలో చక్కెర, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అలాగే, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది, అంటే వెంటనే రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.

4. జంక్ ఫుడ్:

మైదాతో తయారు చేసే ఫుడ్స్ పిల్లలు చాలా డేంజర్. మైదా కారణంగా పిల్లలు బరువు పెరుగుతారు. బర్గర్లు, పిజ్జాలు, హాట్ డాగ్స్ వంటి వాటిలో ప్యాటీలు, కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.

5. ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్:

ఇందులో షుగర్, క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. టెట్రా ప్యాకెట్లలో వచ్చే జ్యూస్ ల కంటే పిల్లలకు పండ్లను ఇవ్వడం మంచిది. ఎందుకంటే పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అందుతాయి. పిల్లల ఆహారం నుండి చక్కెర, కొవ్వులను పూర్తిగా తొలగించడం కూడా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అప్పుడప్పుడు వీటిని ఇస్తుండాలి. తద్వారా ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు.