these-foods-you-can-have-while-mahashivratri-fasting
mictv telugu

ఉపవాసం ఉన్నా కూడా ఇవి తినొచ్చు.

February 18, 2023

 these-foods-you-can-have-while-mahashivratri-fasting

ఈరోజు శివరాత్రి….అందరూ ఉపవాసం ఉంటారు, జాగారణ చేస్తారు. కొందరు రోజంతా ఉపవాసం ఉంటే మరికొందరు ఉదయం నుంచి రాత్రి వరకు మాత్రమే ఉంటారు. అయితే మన పెద్దలు కానీ, డాక్టర్లు కానీ చెప్పేది ఒక్కటే మాట. ఎప్పుడూ కటిక ఉపవాసం ఉండకూడదు అని. మనం రోజూ తినే ఆహారం తినకపోయినా లైట్ గా ఏమైనా తినాలని అంటారు. మరి అలాంటిప్పుడు ఏం తినొచ్చే మీకు తెలుసా.

ఉపవాసం రోజున పళ్ళు, పాలు, పాలపదార్ధాలు తినొచ్చు. మెయిన్ గా ఉప్పు, కారాలు తినకుండా ఉండాలి అనుకుంటారు కాబట్టి ఇలాంటివి తినొచ్చు.

డెయిరీ ప్రోడక్ట్స్:

పాలు, పాలపదార్ధాలు ఉపవాసం ఉన్న రోజున తినొచ్చు. స్మూతీస్, షేక్స్ తీసుకుంటే ఆరోగ్యం, పెద్దగా ఆకలి కూడా వేయకుండా ఉంటుంది. పంచదార బదులు బెల్లం, తేనె, డేట్స్ లాంటివి వేసుకోవచ్చు. అలాగే పెరుగు, మజ్జిగ లాంటివి కూడా తీసుకోవచ్చును. ఉపవాసం ఉన్నప్పుడు గ్యాస్, జీర్షసమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ వాటిని దూరం చేస్తాయి. అలాగే తక్షణ శక్తిని కూడా ఇస్తాయి.

పనీర్:

ఇందులోని ప్రొటీన్ ఆకలిని కంట్రోల్ లో ఉంచుతుంది. పనీర్ ను పాయసంలా చేసుకోవచ్చును. లేదా నెయ్యిలో లైట్ గా వేయించుకుని అయినా తినొచ్చును.

పళ్ళు:

ఉపవాసం రోజున ఎలాంటి పళ్ళు అయినా హాయిగా తినొచ్చు. ఇష్టమైన పళ్ళతో పాటు పుచ్చకాయ, అరటిపండులాంటివి తీసుకుంటే ఆకలి వెయ్యకుండా ఉంటుంది. పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి…డీ హైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది. బొప్పాయి. డేట్స్ లాంటివి జీర్ష సమస్యలు దూరమవుతాయి.

నట్స్:

నట్స్, డ్రై ఫ్రూట్స్ లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. కాబట్టి తినకపోవడం వలన మన శరీరానికియ అందనివి అన్నీ నట్స్ తో వచ్చేస్తాయి.

జావ, కిచిడి:

రాగిజావ, అంబలి, సగ్గుబియ్యం పాయసం లాంటివి తాగితే నీరసం రాకుండా ఉంటుంది. అలాగే సాబుదాన కిచిడీ కూడా తినొచ్చు. నార్త్ సైడ్ ఉపవాసం ఉన్న రోజు కచ్చితంగా సాబుదాన కిచిడీ తింటారు.

స్వీట్ పొటాటో:

ఇప్పడు చిలగడ దుంపలు బాగా దొరుకుతాయి. కాబట్టి వాటిని తెచ్చుకుని ఉడికించుకుని తినొచ్చు.