గర్భం అనేది స్త్రీ జీవితంలో మరిచిపోలేని అనుభూతి. ఈ సమయంలో మహిళలు మానసికంగా, శారీరకంగా అనేక మార్పులకు లోనవుతారు. గర్భం దాల్చిన తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సిజేరియన్ డెలివరీ తర్వాత మహిళలు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాడం చాలా ముఖ్యం. వైద్యులు ఆహారంలో చాలా అంశాలను చేర్చుకోవాలని సలహా చేస్తుంటారు. కొన్ని విషయాలకు దూరంగా ఉండాలని కూడా సూచిస్తుంటారు. అయితే సిజేరియన్ డెలివరీ తర్వాత మహిళలు కొన్ని పండ్ల జోలికి అస్సలు వెళ్లకూడదు. ఆ పండ్లు ఏవో తెలుసుకుందాం.
సిజేరియన్ తర్వాత ఏ పండ్లు తినకూడదు?
సిజేరియన్ డెలివరీ తర్వాత, స్త్రీ శరీరం కోలుకోవడానికి సరైన పోషకమైన ఆహారం అవసరం . దీనితో పాటు, వారు కోలుకోవడానికి ఆటంకం కలిగించే ఆహారాలు, పండ్లను ఆహారంలో చేర్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సిజేరియన్ డెలివరీ తర్వాత మహిళలు సిట్రస్ పండ్లను అస్సలు తినకూడదు. ఈ పండ్లను తిన్నట్లయితే గ్యాస్ తదితర సమస్యలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. నారింజ, ద్రాక్ష, నిమ్మ, పైనాపిల్లను ఆహారంలో చేర్చకూడదు. ఎందుకంటే ఈ పండ్లను తినడం వల్ల కడుపులో గ్యాస్ సమస్య వస్తుంది. అంతేకాదు తల్లిపాలు శిశువు తీసుకుంటుంది కాబట్టి సిట్రిక్ పండ్ల లక్షణాలు శిశువు జీర్ణవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తాయి.
సిజేరియన్ తర్వాత ఆహారంలో చేర్చుకోకూడదు
1. ఉరద్, రాజ్మా, బీన్స్ తినకూడదు, ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.
2. స్పైసీ ఫుడ్ తినడం వల్ల మహిళల్లో పొట్ట సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే సిజేరియన్ ప్రసవం తర్వాత స్పైసీ ఫుడ్ తినకూడదు.
3. జంక్ ఫుడ్ తినడం వల్ల స్త్రీల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.
4. మద్యం, ధూమపానం వంటి అలవాట్ల వల్ల సిజేరియన్ తర్వాత కోలుకోవడం ఆలస్యం అవుతుంది.
5. సిజేరియన్ డెలివరీ తర్వాత త్వరగా కోలుకోవడానికి స్త్రీలకు పండ్లు అవసరం. అయితే మీ ఆహారంలో మార్పులు చేయడానికి ముందు మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.