తమిళం, సంస్కృతం ప్రపంచంలోని పురాతన భాషల్లో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. ఇటాలియన్, కొరియన్, పార్సీ, హిబ్రూ, అరామిక్, చైనీస్, గ్రీక్, ఈజిప్షియన్ వంటి ఇతర భాషలు ప్రపంచంలోని పురాతమైనవని తేలిపోయాయి.
సంస్కృతం.. ప్రపంచంలో రెండవ పురాతన భాషగా పరిగణించబడుతుంది. ఇది జైన, హిందూ, బౌద్ధ మతాల భాష. భారతదేశంలో.. సంస్కృతంలో ప్రార్థనలు, పురాతన గ్రంథాలు, సంగీతంలో కూడా ఈ భాష ఉపయోగించబడుతుంది.
నివేదిక ప్రకారం.. ఈజిప్షియన్ అత్యంత పురాతనమైన భాషలో మొదటిస్థానంలో ఉంది. సంస్కృతం ప్రపంచంలో రెండవ పురాతన భాష. 300బీసీలో తమిళ భాష జాడలు కనిపిస్తున్నాయి. ఇది తమిళనాడులో మాత్రమే వినిపిస్తుందని అనుకునేరు. సింగపూర్, శ్రీలంకలో అధికార భాషల్లో తమిళం ఒకటి.
పార్సీ భాష దాదాపు 500బీసీలో ఉద్భవించింది. దీనిని పర్షియన్ కమ్యూనిటీ మాట్లాడుతుంది. ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, తజికిస్తాన్, అజర్ బైజాన్ లోని ప్రజలు కూడా దీనిని ఉపయోగిస్తారు. చైనీస్ భాష 1250 బీసీ నాటిది. కొరియన్ భాష కూడా భాషల్లో ఒకటి. దాని చరిత్ర వేల సంవత్సరాల క్రితం నాటిది. ఇది ఉత్తర, దక్షిణ కొరియాలో ఉపయోగించబడుతుంది.
వరల్డ్ పాపులేషన్ రివ్యూ(డబ్ల్యూపీఆర్) నివేదిక ప్రకారం.. ప్రపంచలోనే అత్యంత పురాతన దేశాల్లో భారత్ ఏడో స్థానంలో ఉంది. డబ్ల్యపీఆర్ నివేదిక ప్రకారం ఇరాన్ ప్రపంచంలోనే అత్యంత పురాతన దేశంగా పరిగణించబడుతుంది. ఒక నివేదిక ప్రకారం ఇరాన్ ప్రభుత్వం 3200 బీసీఈలో స్థాపించబడింది. ఆ తర్వాత ఈజిప్ట్, వియత్నాం, అర్మేనియా, నార్త్ కొరియా, చైనా, ఇండియా, జార్జియా, ఇజ్రాయిల్, సూడాన్, ఆఫ్ఘనిస్తాన్లు నిలిచాయి. స్వీయ సార్వభౌమాధికారం, తేదీ ఆధారంగా జపాన్ ప్రపంచంలోని పురాతన దేశం. తర్వాత చైనా, ఫ్రాన్స్ ఇతర దేశాలు నిలిచాయి.