శరీరంలోని అవయవాలు పనిచేయకపోతే మనిషి చనిపోతాడు ఇది అందరికీ తెలుసు. ఏ ఒక్క అవయవం పని చేయకపోయినా ప్రాణం పోతుంది. అయితే మనం చనిపోయాకు కూడా మన శరీరంలో కొన్ని అవయవాలు మాత్రం పని చేస్తూనే ఉంటాయి. కొన్ని గంటల వరకు ఇవి ఆక్టివ్ గా ఉంటాయి. అవేంటో మీకు తెలుసా?
మరణానికి ముందు అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేస్తాయి. అన్నింటిలో మొదటగా ఆగిపోయేది శ్వాస. శ్వాస ప్రక్రియ మూతపడగానే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. తర్వాత ఐదు నిమిషాల్లో శరీరంలో ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి కణాలు చనిపోతాయి. ఈ పరిస్థితిని ‘పాయింట్ ఆఫ్ నో రిటర్న్’ అంటారు. దీని తరువాత, శరీర ఉష్ణోగ్రత ప్రతి గంటకు 1.5 డిగ్రీలు తగ్గుతుంది. కానీ మరణం తరువాత కూడా చర్మం 24 గంటలకు పైగా సజీవంగా ఉంటుంది. శరీరంలోని కొన్ని కణాలు చనిపోయిన తర్వాత కూడా చురుగ్గా ఉండి తమను తాము బాగు చేసుకుంటూ ఉంటాయి. చాలా రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మనుషులే కాకుండా, జంతువులలో కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది.
చర్మం తర్వాత మూత్రపిండాలు, కాలేయం, గుండె లాంటి అవయవాలు కూడా మరణించి తర్వాత శరీరం లోపల 6 గంటల పాటు ఆక్టివ్ గానే ఉంటాయి. వీటిని ఇంకొక వ్యక్తికి ఎవరికైతే అమరుస్తారో…అది 6 గంటలలోపు జరిగిపోవాలి. ఎందుకంటే అప్పటి వరకే వాటి కణాలు సజీవంగా ఉంటాయి.ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా, అతని జుట్టు, గోళ్ళ కణాలు చురుకుగా ఉంటాయి. జుట్టు మరియు గోర్లు వాటంతట అవే పెరుగుతూ ఉంటాయి. మరణానంతరం గడ్డం పెరిగేవారు వారు కొందరు ఉంటారు.
మరో వింతైన విషయం ఏంటంటే శరీరంలోని మూత్రాశయాన్ని ఖాళీ చేసే ప్రక్రియ మరణం తర్వాత కూడా కొనసాగుతుంది. శరీరం నుండి మూత్రం బయటకు వస్తూ ఉండటం వల్ల మృతదేహాలు కొన్ని తడిగా కనిపిస్తుంటాయి.మన జన్యువులు మరణానంతరం జీవిస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. పరిశోధనల ప్రకారం మరణం తర్వాత మాత్రమే DNA మరింత చురుకుగా మారుతుంది. అంతేకాదు ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లను తయారు చేయడం ప్రారంభిస్తుందిట.ఇది మాత్రమే కాదు, జీర్ణక్రియ మరణం తర్వాత మానవ శరీరంలో కొనసాగుతుందని చెబుతున్నారు. అప్పుడు వెలువడే అమైనో ఆమ్లాల వల్ల శరీర దుర్వాసన వస్తుంది. అందుకే చనిపోయాక ముక్కు, నోటిని దూదితో కప్పుతారు.
మనిషి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, శ్వాస ఆగిపోతుంది కానీ మెదడు మాత్రం చురుకుగానే ఉంటుంది. ఇలా శ్వాస ఆగిపోయాక కూడా బతికున్నవాళ్ళూ ఉన్నారు.మళ్ళీ బతికున్నామని చెప్పుకుని తమకు జరిగిన సంఘటనలను చెప్పుకోలేని స్థితిలో కొందరున్నారు. కొన్నిసార్లు వారు తమ భావాలను పూర్తిగా వివరిస్తారు.మరణించిన తర్వాత కూడా నాడీ వ్యవస్థ తన పనిని ఆపివేయడానికి చాలా సమయం తీసుకుంటుందని యేల్ యూనివర్సిటీ పరిశోధన చెబుతోంది. చనిపోయాక శరీరం లేచినట్టు అనిపించడం, కదలికలు చేయడం కనిపించడానికి ఇదే కారణం. కండరాలు గట్టిపడతాయి కానీ కొన్నిసార్లు అవి జీవించి ఉన్నప్పుడు మునుపటిలా కదులుతాయి.
ఇలా మనం చనిపోయాము అని అనుకున్న తర్వాత కూడా మన అవయవాలు బతికే ఉంటాయి కాబట్టే అవయవ దానం చేయాలంటారు. అన్నిదానాల్లోకల్లా అవయవ దానం ఉత్తమం అనేది కూడా అందుకే. మనం చనిపోయినా మన అవయవాలు పని చేస్తాయి కాబట్టి వాటిని ఇంకొకరికి అమర్చ వచ్చును. అయితే ఏ పార్ట్ ఎన్ని గంటలు పనిచేస్తోందో ఆ లోపలే బాడీ నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. అంతే వేగంగా ఇంకొకరికి అమర్చాల్సి కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిపోయింది కాబట్టి పార్ట్స్ ని నిల్వ చేసే పద్ధతి కూడా వచ్చేసింది.