శనగపప్పు వాడకంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?  - MicTv.in - Telugu News
mictv telugu

శనగపప్పు వాడకంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? 

August 21, 2019

precautions are taken in the use of besan

వానాకాలంలో బయట చల్లగా వుంటే ఇంట్లో వేడివేడిగా మిరపకాయ బజ్జీలు దేవుకుని తినాలని ఎవరికి వుండదు చెప్పండి?  శనగపిండితో చేసే ఆ బజ్జీలను చూడగానే నోరూరని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. శనగపిండితో అనేక రకాల వంటలు చేస్తారు.బజ్జీలే కాదు గారెలు, బూరెలు, భక్ష్యాలు(ఓళిగలు) పెరుగు వడలు, లడ్లు, పప్పు కూర, ఉడకబెట్టిన శనగలు.. ఎన్నోరకాలుగా వీటిని మనం రోజువారీ జీవితంలో వాడుతుంటాం. 

భారతీయ వంటకాల్లో శనగ పప్పుకు ఉండే ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. 

మోతాదు మించితే మంచిది కాదు.. 

శనగ పిండి ఎక్కువగా తినడంవల్ల గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. మోతాదుకు మించకుండా ఈ పప్పును తినడం మంచిది. ఈ పిండి చాలా మృదువుగా వుంటుంది కానీ, కడుపులోకి వెళ్లాక అంత తొందరగా జీర్ణం అవదు. జీర్ణశక్తిని, పేగులను, శరీర సమతుల్యతను దెబ్బతీస్తుంది. వాత, కఫ, పైత్యాలను పెంచే ద్రవ్యాలు ఈ పప్పులో వుంటాయి. ఇది మలబద్దకాన్ని కలిగిస్తుంది. కంటికి చెడు చేస్తుంది.వేడితత్వం వున్నవారికి శనగలు మరింత వేడిని పెంచుతాయి. వాతం వున్నవారికి బాధలు పెరుగుతాయి. కఫతత్వం వున్నవారికి మందగుణం, చలాకీతనం, ఉత్సాహం లేకుండా చేస్తుంది. షుగర్, బీపీ, అర్థటైటిస్, పేగుపూత, ఎలర్జీలు, స్థూలకాయం వున్నవారు ఈ పప్పును తీసుకోకపోవడం మంచిది. దీర్ఘవ్యాధుల విషయంలో  శనగపిండి ప్రస్తావన వచ్చినప్పుడు జీర్ణశక్తిని బట్టే తినాలి.  

శనగపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు..

దీనిని శాస్త్రీయంగా సిసర్ అరిటీనమ్ ఎల్ అని వ్యవహరిస్తారు. శనగ పప్పు పోషక భరితమైనది. ఫైబర్, జింక్, కాల్షియం, ప్రోటీన్, ఫోలేట్లోలను అధికంగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో శనగ పప్పును తరచుగా జోడించుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అని వైద్యులు చెబుతున్నారు. జీవక్రియలను పెంచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో శనగ పప్పులోని పీచు పదార్ధాలు జీర్ణక్రియలకు దోహదపడతాయి. రక్తపోటును నివారించడంలో, మధుమేహాన్ని అదుపు చేయడంలో ఈ పప్పు చక్కని పాత్రం పోషిస్తుంది.  హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ఇందులోని సెలీనియం నిక్షేపాలు క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి. మహిళల్లో హార్మోన్ స్థాయిలను క్రమబద్దీకరించడం, మూత్రపిండాలలో మరియు పిత్తాశయాలలో రాళ్లను తొలగించడంలో ఇది సహాయకారిగా పనిచేస్తుంది. 

శనగపప్పుతో అందం.. 

 

పొడిచర్మం గలవారు శనగపిండి, పాలు, తేనె, కొద్దిగా పసుపు కలిపి ఫేస్ ప్యాక్‌గా తయారు చేసుకుని వాడాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడి బారదు. ఈ ఫేస్ ప్యాక్‌ను రోజు వాడటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.

 

రెండు చెంచాల శనగ పిండి, ఒక చెంచా పాలు మరియు చిటికెడు పసుపులను కలిపి ఒక పేస్టులా తయరుచేసి. ఆ మిశ్రమాన్ని చర్మానికి పూసి, ఎండిన తరువాత చల్లటి నీటితో కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడతాయి. 

 

40 సంవత్సరాలు దాటిన కొందరు పురుషులు శీఘ్ర స్ఖఖనం సమస్యతో  బాధపడుతుంటారు. అలాంటి వారు రెండు చెంచాల శెనగ పిండిలో కొంచెం ఖర్జూరం, పాలపిండి కలిపి ప్రతి రోజూ రెండుపూటలా తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.

 

మనం స్నానం చేసే కొన్ని షాంపుల కారణంగా వెంట్రుకలు ఊడిపోతుంటాయి. షాంపుకు బదులు ప్రతిసారీ శనగపిండితో తలస్నానం చేస్తే వెంట్రుకలు పెరుగుతాయి. అంతేకాదు శిరోజాలు పట్టుకుచ్చులా కాంతివంతమై కుదుళ్లు కూడా గట్టిపడతాయి.