వీళ్లు ఏ రకం దొంగలో..... - MicTv.in - Telugu News
mictv telugu

వీళ్లు ఏ రకం దొంగలో…..

September 15, 2017

దొంగల్లో ఎన్ని రకాలు… ఆ… దాంట్ల రకాలుగా కూడానా అనుకోకండి. దొంగలు అనగానే కొందరికి దొంగ, మంచి దొంగ, జేబు దొంగ, గజ దొంగ, ఘరనా దొంగ, దొంగ-దొంగ, దొంగలకు దొంగ… ఇట్లా సిన్మల పేర్లు గుర్తుకొస్తవి కొందరికి. తమిళనాడు రాష్ట్రంలో   జరిగిన దొంగతనం గురించి తెల్సిన  తర్వాత వాళ్లను ఏ రకం దొంగలు అంటారే  మీ ఇష్టం.

తమిళనాడు రాష్ట్రం తేని జిల్లాలో పెరియకుళమ్ తెన్ కరైన భారతి  అనే నగరంలో నివసిస్తున్న వ్యాపారి అబ్దుల్ రహీం  ఇంట్లో దొంగలు పడ్డారు. సహజంగా దొంగలు దోచుకోవడానికి వస్తే  ఇంట్లో వాళ్లను కొట్టి, బెదిరించి దోచుకు పోతారు. లేదంటే  భయపెడ్తారు. కానీ ఈ దొంగలు మాత్రం ఇంట్లో వాళ్ల నిద్రకు ఏ మాత్రం భంగం కలుగకుండా వారు పడుకున్న గదికి తాళం వేసి ఇంటిని చక్క బెట్టుకున్నారు.  బీరా తెరిచి దాంట్లో ఉన్నవి ఎత్తుకెళ్లాలని చూశారు. బీరువా లాకర్ ఓపెన్ కాలేదు. అందులోని బట్టలు బయట వేసి  బీరువాను ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఏ ఒక్క సామానూ ముట్ట లేదు. పొద్దున లేచిన ఇంటి యాజమానికి పక్కింటి వారికి ఫోన్ చేస్తే వచ్చి గడియ తీశారు. ఆ తర్వాత ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారట.