Thief hide in Teddy bear stomach
mictv telugu

టెడ్డీ బేర్‌లో దాక్కున్న దొంగ.. ఊపిరాడక..

August 13, 2022

Thief hide in Teddy bear stomach

దొంగలు పోలీసులకు దొరక్కుండా ఎన్నో గిమ్మిక్కకులు చేస్తుంటారు. కొన్ని ఊహకు కూడా అందవు. ఇంటిపై దాడి చేసిన పోలీసులకు దొరక్కూడదని ఓ దొంగోడు ఏకంగా టెడ్డీ బేర్ బొమ్మలో దాక్కున్నాడు. టైం బాలేక, ఇక చచ్చిపోతానని భయపడిపోయి అటూ ఇటూ కదలి అడ్డంగా దొరికిపోయాడు. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో ఈ తలతిక్క బాగోతం చేసుచేసుకుంది.
జాషువా డాబ్సన్ అనే 18 ఏళ్ల టీనేజ్ దొంగ ఇటీవల ఓ కారును చోరీ చేశాడు. అంతటితో ఆగకుండా పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టించుకుని డబ్బు కూడా ఇవ్వకుండా పారిపోయాడు. పోలీసులు సీసీ కెమెరాల సాయంతో వెంటాడారు. జాషువా తన ప్రియురాలి ఇంట్లో ఉన్నట్లు కనిపెట్టి రైడ్ చేశారు. ఇంట్లో ఉన్న కుర్రదొంగ పోలీసులకు దొరక్కూడదని ఓ ప్లాన్ వేశాడు. గతంలో ఆ ప్రియురాలికి తను కొనిచ్చిన ఐదు అడుగుల టెడ్డీ బేర్ పొట్ట కోసి తను అందులో దూరిపోయాడు. బొమ్మలా నటిస్తూ ఓ మూలన కూర్చున్నాడు. అయితే టైట్‌గా ఉండడంతో ఊపిరి అందక కదిలాడు. పోలీసులు నవ్వుకుంటూ ‘లేమ్మా లే, నీ కథ ముగిసింది’ అని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.