దొంగ అంటే ఇట్ల ఉండాలే.... అబ్బా...ఎంత తెల్వో.... - MicTv.in - Telugu News
mictv telugu

దొంగ అంటే ఇట్ల ఉండాలే…. అబ్బా…ఎంత తెల్వో….

June 27, 2017

కొంత మందుంటరు… పరామనందయ్య  శిష్యుడు  అంటే గీయనే అని బల్లగుద్ది మరీ చెప్తరు. ఇంకా కొంత మంది ఉంటరు పరమానందయ్యనే పరేషాన్ చేసి… ఆయన శిష్య గణానికే లీడర్ అంతటి వారుంటరు. ఇగో ఈ వీడియో ఎక్కడది సరిగ్గా  తెల్వదు కని…. ఇది చూస్తే మాత్రం నవ్వాపుకోలేరు… ఎంత వద్దనకున్నా… నవ్వు కట్టలు తెంపుకు రావడం ఖాయం.

దొంగతనం చేయడానికి పోయినోడు… ఏన్క ముందు అన్నీ చూసుకోవాలి కదా… అయితే ఈ దొంగ చాలా తెలిగల వాడు… ఓ పక్కనంగా బార్లా……  తెర్సుకోని ఉన్నా కూడా  పక్క సందు పోంటి పోయి… కిటికీ ఇరగొట్టి  లోపటికి పోయిండు…. దాంట్ల  పోయినంగ తెల్సింది… ఈ పక్కన అంతా ఓపెన్ అని.  కిమ్మనకుండా దాంట్ల బయటికొచ్చిండు…. చూడండి మీరు కూడా ఈ దొంగ గారి… కాదు కాదు… పరామానందయ్యకు అస్సలు సిస్సలు శిష్యపరమాణు తెలితేటలు… ఇసోంటి దొంగలు ఉంటే గనుక ఇంటికి తాళం వేయకుండా….డబ్బులు దస్కం  అంతా వాకిట్లేసి పోవచ్చు. మంచిదొంగ…సోయి లేని దొంగ… దొంగలకు దొంగ…… గో………ప్ప దొంగ కదా…..ఎట్ల తూకం వేసినా….ఈయన తెల్వి తెల్వే.