సోషల్ మీడియా.. దొంగోడిని మంచోణ్ని చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

సోషల్ మీడియా.. దొంగోడిని మంచోణ్ని చేసింది..

November 21, 2019

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది అందులోనే మునిగిపోతున్నారు. ఇతరులతో సంబంధం లేకుండా ఒంటరి జీవితాన్ని చాలా మంది గడుపుతున్నారు. మోసాలు చేసేవారు కూడా దీన్నే వేదికగా చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు వీటి వల్ల అనర్థాలే ఎక్కువగా జరిగాయి. కానీ వీటితో అనర్థాలే కాకుండా మంచి కూడా జరుగుతుందని ఈ ఘటన నిరూపించింది. సోషల్ మీడియా ఓ దొంగలో పరివర్తన తీసుకువచ్చింది. ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది.  

వర్జీనియాలోని రిచ్‌మండ్ ప్రాంతానికి చెందిన  ఓ వ్యక్తి చాలా కాలంగా చోరీలు చేస్తున్నాడు. ఇటీవల కూడా ఓ మ్యూజిక్ స్కూలు వద్ద దొంగతనానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఓమ్యూజిక్  స్కూల్‌కు వెళ్లి అక్కడ సన్నాయి, సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో న్యూస్ ఛానెళ్లు.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీన్ని చూసిన ఆ దొంగలో పరివర్తన ప్రారంభమైంది. తాను చేస్తున్న పని వల్ల చాలా మంది బాధపడుతున్నారని అర్థమైంది. వెంటనే పశ్చాతాపంతో సన్నాయి, సెల్‌ఫోను స్కూలు వద్ద ఉన్న ఓ చెట్టుకు తగిలించి వెళ్లాడు. 

ఆ బ్యాగులో ఓ లేఖ కూడా రాసిపెట్టాడు. అందులో క్షమాపన కోరుతూ.. తాను చేసిన పనికి పశ్చాతపం వ్యక్తం చేశాడు. దీన్ని చూసిన వారంతా అతనిలో వచ్చిన మార్పుపై సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా సోషల్ మీడియా కారణంగా ఓ వ్యక్తిలో మార్పు రావడం మంచి పరిణామని అభిప్రాయపడుతున్నారు.