వీడియో : జేసీబీతో ఏటీఎం మెషీన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : జేసీబీతో ఏటీఎం మెషీన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు

April 25, 2022

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ చోరులకు దొంగతనాలు చేయడం కష్టమైపోతోంది. దీంతో వారు కూడా సరికొత్త ఆలోచనలతో చోరీలు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. సాంగ్లీలో జరిగిన ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఏటీఎంను దొంగిలించాలనుకొని జేసీబీ సహాయంతో మొత్తం మెషీన్‌నే ఎత్తుకుపోయారు. వైరలవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే దేశంలో నిరుద్యోగం, ధరలు పెరిగిపోతున్నందునే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కామెంట్ చేస్తున్నారు.