జేసీబీ సహాయంతో బ్రిడ్జినే ఎత్తుకుపోయిన దొంగలు - MicTv.in - Telugu News
mictv telugu

జేసీబీ సహాయంతో బ్రిడ్జినే ఎత్తుకుపోయిన దొంగలు

April 9, 2022

ngn

దొంగలకు పేరుగాంచిన బీహార్‌లో భారీ, వింత దొంగతనం జరిగింది. చిన్న చిన్న దొంగతనాలకు బదులు ఏకంగా కుంభస్థలాన్నే కొట్టాలని భావించి ఏకంగా స్టీల్ బ్రిడ్జిని చోరీ చేశారు. మూడ్రోజుల కింద జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రోహ్తాస్ జిల్లాలోని అమియావర్ గ్రామ సమీపంలో ఉన్న ఆర సోనే కాలువపై 45 ఏళ్ల క్రితం నిర్మించిన 60 అడుగుల వంతెన ఉంది. ఇది పాతబడిపోవడంతో దీని పక్కనే కొత్త కాంక్రీట్ బ్రిడ్జి కట్టారు. ప్రస్తుతం ఇది వాడుకలో లేకపోవడంతో దొంగల కన్ను దీని మీద పడింది. ఈ నేపథ్యంలో జేసీబీ, కట్టర్ల సహాయంతో మూడ్రోజుల పాటు వంతెనను ముక్కలుముక్కలు చేశారు. గమనించిన చుట్టుపక్కల వారు ఇదేంటని ప్రశ్నిస్తే.. ఇది ప్రభుత్వం చేయిస్తోంది అని బదులివ్వడంతో ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాలేదు. మూడ్రోజుల తర్వాత చోరీ జరిగింది అని గుర్తించడంతో ఇరిగేషన్ డిపార్ట్‌మెంటులో పనిచేసే జూనియర్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీస్ అధికారి సుభాస్ కుమార్ వెల్లడించారు.