ఎంత దొంగలైనా వీళ్లకీ ఓ పద్ధతి.. లూటీ చేసేముందు పూజలు - MicTv.in - Telugu News
mictv telugu

ఎంత దొంగలైనా వీళ్లకీ ఓ పద్ధతి.. లూటీ చేసేముందు పూజలు

May 28, 2022

వాళ్లు దొంగలే.. కానీ ఓ నియమం ప్రకారం దోచుకునేముందు.. దైవాన్ని తలుచుకొని, పరమ భక్తితో పూజ చేసి ఆ తర్వాత పని మొదలెట్టారు. ఎటువంటి ఆటంకం కలగకూడదని నైవేద్యం కూడా సమర్పించి చక్కగా లూటీ చేశారు. ఈ విచిత్ర సంఘటన కేరళలోని కొల్లాంలో జరిగింది. మే 16వ తేదీన పాతనాపురంలోని జనతా జంక్షన్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఫైనాన్షియల్ సంస్థ పతనపురం బ్యాంకులో దొంగలు పడ్డారు. ఈ క్రమంలో వారు తమ దొంగతనం విజయవంతం కావాలని పూజలు చేసి మరీ లాకర్‌ ఓపెన్‌ చేసారు. లాకర్‌ ముందు పూలు, తమలపాకులు, నైవేద్యంగా మద్యం ఉంచి చక్కగా పూజలు చేసి అనంతరం 30 లక్షల విలువైన నగలు, 4 లక్షల నగదుతో ఉడాయించారు. ఆ తర్వాతి రోజు ఉదయం 9 గంటలకు యజమాని రామచంద్రన్ నాయర్ బ్యాంకుకు వెళ్లగా బ్యాంకులో చోరీ జరిగినట్టుగా గుర్తించారు. తమ సంస్థలో దొంగలు పడ్డారని , వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…పరిసరాలను పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరు చూసి పోలీసులు అవాక్కయ్యారు. బ్యాంకు లాకర్ ముందు ఆధ్యాత్మిక పూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించాయి.