శ్మశానాన్నీ వదలని దొంగలు.. ఏమేం ఎత్తుకుపోయారంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

శ్మశానాన్నీ వదలని దొంగలు.. ఏమేం ఎత్తుకుపోయారంటే..

May 18, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కొందరు కేటుగాళ్లు శ్మశానాలను కూడా వదలటం లేదు. మృతదేహాలకు దహన సంస్కారాలు జరిపిన తర్వాత దొంగతనాలకు పాల్పడుతూ విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు. ఈ క్రమంలో పాతబస్తీ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గల నల్లవాగు శ్మశాన వాటికలో చోరీ జరిగిందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా సంచలన విషయాలు బయటపడ్డాయి.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..”నిత్యం రద్దీగా ఉండే నల్లవాగు శ్మశానవాటికలో మంగళవారం పలు మృతదేహాలకు దహన సంస్కారాలు జరిపాం. ఆ తర్వాత శ్మశానవాటిక ప్రధాన ద్వారానికి తాళాలు వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాం. రాత్రి సమయంలో శ్మశాన వాటికలో ఉన్న గదిలో చోరీకి జరిగింది. రూ.30 వేల నగదు, డీజిల్, బ్యాండ్ సామాను, దహన సంస్కారాలు కోసం వాడే ఇత్తడి సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలు ఉన్న అవి పనిచేయటం లేదు. దొంగలు ఆ విషయాన్ని పసిగట్టి ఈ చోరీకి పాల్పడ్డారు. ఇప్పటికే ఈ ఏరియాలో పలుమార్లు దొంగతనాలకు పాల్పడిన ఘటనలున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు” అని వారు వాపోయారు. అనంతరం చాంద్రాయణగుట్ట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.