చికెన్ ధరల ప్రభావం.. ఇనుప జాలీల్లోని కోళ్ల దొంగతనం - MicTv.in - Telugu News
mictv telugu

చికెన్ ధరల ప్రభావం.. ఇనుప జాలీల్లోని కోళ్ల దొంగతనం

March 22, 2022

chiken

వేసవికాలం సమీపిస్తుండడంతో చికెన్ సరఫరా తగ్గి రిటైల్ రేటు అమాంతం పెరిగిపోయింది. రూ. 300 కి కిలో చికెన్ అమ్ముతుండడంతో చాలా మంది కొనుగోళ్లను గతం కంటే తగ్గించారు. అయితే కొందరు దుండగులు చికెన్ షాపు ముందు ఉండే ఇనుప జాలీల్లో ఉన్న కోళ్లను ఎత్తుకెళ్తున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. వివరాలు.. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో వెంకన్న అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా చికెన్ దుకాణాన్ని నడుపుతున్నాడు. ఎప్పటిలాగే రాత్రి షాపును కట్టేసి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే సోమవారం అర్థరాత్రి బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు దుకాణం ముందు ఇనుప జాలీల్లో ఉన్న కోళ్లను ఎత్తుకెళ్లారు. పొద్దున్నే షాపు తీద్దామని వచ్చిన వెంకన్న, జాలీల్లో కోళ్లు లేకపోవడం గమనించి చోరీ జరిగిందని గ్రహించాడు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా, చోరీ జరిగినట్టు తేలింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విచారణలో ఉంది.