అందరూ యోగిలా ఆలోచిస్తే... - MicTv.in - Telugu News
mictv telugu

అందరూ యోగిలా ఆలోచిస్తే…

June 3, 2017


సీఎం టూర్ అంటే.. అధికారుల హడావుడి అంతా ఇంతా ఉండదు. క్షణాల్లో సకల సౌకర్యాలు పుట్టిస్తారు. అబ్రకదబ్ర అన్నట్టు ఆ ప్రాంతాన్ని రాజప్రసాదంలా చేసేస్తారు. సీఎం వచ్చే టైమ్ కి అన్ని ఉండేలా చూసుకుంటారు. కేసీఆరైనా..చంద్రబాబైనా..యోగినైనా ..ఏ సీఎం వచ్చినా ఆయా రాష్ట్రాల అధికారులు ఇలాగే చేస్తుంటారు. కానీ యూపీ అధికారుల ఓవరాక్షన్ …సీఎం యోగికి చిరాకు తెప్పించింది. ఎందుకంటే..

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రెండు ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో అధికారులు చేసిన హడావుడి వివాదాస్పదమైంది.గతనెల బీఎస్‌ఎఫ్‌ జవాను ప్రేమ్‌ సాగర్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం యోగి వెళ్లిన సమయంలో ఆ ఇంటిని అధికారులు ఖరీదైన వస్తువులతో నింపారు. సీఎం వెళ్లిపోగానే అధికారులు ఇంట్లో పెట్టిన ఏసీ, సోఫా తదితరాలను తీసేశారు. దీంతో తమను అధికారులు అవమానించారు అంటూ అమరజవాను సోదరుడు వాపోయాడు. అంతకుముందు కూడా సీఎంను కలిసేందుకు వచ్చే ప్రజలను స్నానాలు చేసి రావాలంటూ సబ్బులు, షాంపూలు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. వీటిపై సీఎం యోగి సీరియస్‌ అయ్యారు. తాను పర్యటించే ప్రాంతాల్లో తన కోసం ఎటువంటి ఆర్భాటాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దని ఆదేశించారు. ఈ మేరకు ఆయన ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘మనం నేలపై కూర్చొని ఉండేవాళ్లమే, అందుకే ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ వద్దు. ముఖ్యమంత్రి అనే గౌరవం ఉంటే చాలు’ అని యోగి ఆదేశాల్లో చెప్పారు. చూడలా అధికారులు ఇప్పటికైనా మారుతారేమో…