నెమ్మదిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలోనే ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించకపోయినా విదేశాల నుంచి వస్తున్నవారికి ఎయిర్ పోర్టుల్లో ర్యాండమ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజుల్లో 6వేల మందికి టెస్ట్ చేయగా అందులో 39 మంది విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇలా పై దేశాల నుంచి వస్తున్నవారికి పాజిటివ్ లు రావడం ఆందోళన కలిగిస్తోంది.
భారత్ లో రానున్న 40 రోజులు కీలకమైనవి అంటున్నారు అధికార వర్గాలు. ఈ రోజుల్లో కోవిడ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలోని డేటా ప్రకారం జనవరిలో తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రజలు కోవిడ్ ప్రోటో కాల్స్ పాటిస్తూ తగిన జాగ్రత్తలో ఉండాలని చెబుతున్నారు. మరోవైపు ఎయిర్ పోర్ట్ ల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ను స్వయంగా కేంద్ర ఆరోగ్య శాకా మంత్రి మన్సుఖ్ మండవీయి వెళ్ళి పరిశీలించనున్నారు.