This 7-yr-old girl wants to invest her saved money into mutual funds
mictv telugu

మ్యూచువల్ ఫండ్ గురించి ఏడేళ్ల పాప వీడియో.. పేటీఎం సీఈఓ ఫిదా

October 27, 2022

ఏడేళ్ల పాప మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పిన మాటలు.. పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మను ఆకట్టుకున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పెరుగుతాయో చక్కగా వివరిస్తూ ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోకి విజయ్ శేఖర్ శర్మ కూడా స్పందించారు. ఈ వీడియోలో ఏడేళ్ల బాలిక తాను పొదుపు చేసుకున్న మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ పెడుతున్నట్టు తెలిపింది. తనకి వచ్చిన దీపావళి కానుకలతో నా కూతురు ఏం చేయాలనుకుంటుందంటే.. అంటూ ఒక క్యాప్షన్‌తో ఈ పాప వీడియోను షేర్ చేసింది ఆ ట్విటర్ యూజర్.

ఈ వీడియోలో ‘‘మ్యూచువల్ ఫండ్స్ వారికి ఏ కంపెనీలు మంచివి. ఏ కంపెనీలు చెడ్డవో తెలుసు. మ్యూచువల్ ఫండ్స్ వారు మంచి కంపెనీల్లో డబ్బులు పెడితే.. ఆ కంపెనీలు లాభం ఆర్జిస్తే, మన మనీ కూడా పెరగడం మొదలవుతుంది ’’ అంటూ ఆ పాప చెప్పింది.

ఎంత కాలం మనీని మ్యూచువల్ ఫండ్స్ పెట్టాలనుకుంటున్నావంటూ తన తల్లి అడగగా.. పదేళ్ల పాటు అంటూ సమాధానం చెప్పింది. అయితే మ్యూచువల్ ఫండ్స్‌ ద్వారా ప్రతిసారి లాభాలు ఆర్జించడం కుదరదంటూ కూడా ఆ పాప స్పష్టం చేసింది. దీనిలో రిస్క్‌లున్నాయంటూ చెప్పుకొచ్చింది. ఈ పాప వీడియో షేర్ చేస్తూ.. పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ కూడా ‘‘మ్యూచువల్ ఫండ్ సహీ హై’’అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోకి ట్విటర్‌లో అనూహ్యమైన స్పందన వస్తుంది. ఈ పాప తీరు, తెలివి చూస్తే భవిష్యత్తులో ఏ ఆర్థిక వేత్తగానో మారినా ఆశ్చర్యం లేదంటున్నారు నెటిజన్లు