ఈ కుక్కకు డయాబెటిస్.. గుండె చెమర్చే కథ - MicTv.in - Telugu News
mictv telugu

ఈ కుక్కకు డయాబెటిస్.. గుండె చెమర్చే కథ

June 1, 2022

ఫోటోలో కనిపిస్తున్న కుక్క పేరు బేబీ గర్ల్. ఈ కుక్కకు కెనైన్ డయాబెటిస్ అనే వ్యాధి ఉంది. దీంతో ప్రతీనెలా ఇన్సులిన్ ఇంజెక్షన్, వ్యాధికి తగ్గట్టు ప్రత్యేక ఆహారం అవసరమవుతాయి. దీనిని పెంచుకున్న యజమాని అప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. తనకే ప్రతీనెలా వైద్యానికి వేల రూపాయలు కావాలి. ఇంక కుక్కకు ఎక్కడనుంచి తేవాలని భావించి దానిని ప్రజలు తిరిగే ప్రదేశంలో వదిలిపెట్టాడు. ఎందుకంటే ఎవరైనా దయగల వారు కుక్కను చేరదీయకపోతారా అని. పక్కనే బ్యాగులో కుక్కకు కావాల్సిన ఆహారం, అది ఆడుకునే వస్తువులు పెట్టి, కుక్కకు ఉన్న రోగం, తాను ఎందుకు వదలిపెట్టిందీ తదితర వివరాలతో ఓ లేఖ కూడా రాసి అందులో పెట్టాడు. కుక్కను చూసిన జంతువుల బాగోగులు చూసే ఓ చారిటీ సంస్థ వాళ్లు రోగ నిర్ధారణ కోసం మెడికల్ ల్యాబ్‌కు పంపారు. అందులో నిజమని తేలడంతో కుక్కకు అయ్యే ఖర్చును భరించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన యజమాని కుక్కపై ప్రేమతో ఉండబట్టలేక పరుగున వెళ్లి చారిటీ వాళ్లను కలిశాడు. తన నిస్సహాయతను వారి ముందు వ్యక్తం చేయగా, వారు కుక్క భవిష్యత్తుకు భరోసానిచ్చి యజమానిని సాగనంపారు. కాగా, ఈ ఘటన అమెరికాలో జరిగింది.