తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్లోని జెడ్పీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బర్ధవాల్ కృష్ణ మూడుసార్లు పాము కాటుకు గురైయ్యాడు. అయినా కూడా ప్రాణాలతో బయటపెట్టాడు. పాముకాటుకు సంబంధించిన వివరాలను స్కూల్ టీచర్లు మీడియాకు వెల్లడించారు.
”పెద్ద కొడప్గల్లోని జెడ్పీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బర్ధవాల్ కృష్ణను శుక్రవారం ఉదయం పాము కరిచింది. వెంటనే అతడిని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించాం. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం బర్ధవాల్ కృష్ణ ఆరోగ్యంగానే ఉన్నాడు. షాకింగ్ విషయం ఏంటంటే..డాక్టర్లు అతడిని ఇంతకు ముందు పాము ఎప్పుడైన కరించిందా? అనే అడిగితే..అతడు ఇది మూడోవసారి మేడం అని చెప్పాడు. దాంతో మేము, మా స్కూల్ పిల్లలం షాక్ అయ్యాం” అని అన్నారు.
విద్యార్థి బర్ధవాల్ కృష్ణ.. చావుని తండాకు చెందినవాడు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ, జీవనం సాగిస్తున్నారు. కృష్ణకు పాము కాటు వేయడం ఇది మూడోసారి. జూన్ 23న కూడా పెద్ద కొడప్గల్లోని బాలుర సంక్షేమ హాస్టల్లో ఇదే విద్యార్థికి పాము కాటు వేసింది. గతంలోనూ ఒక ప్రైవేటు స్కూల్లో కృష్ణను పాము కరిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మూడుసార్లు పాము కరవడంతో కృష్ణ ఆరోగ్యం మంచిగా ఉన్నప్పటికి తల్లిదండ్రులు మాత్రం భయాందోళనకు గురౌతున్నారు.