This Chinese device lets partners share smooches over internet. Here’s how much it costs
mictv telugu

ఈ చైనీస్ ముద్దు కాస్ట్లీ గురూ!

February 27, 2023

This Chinese device lets partners share smooches over internet. Here’s how much it costs

చైనీస్ అంటేనే కొత్త ఆవిష్కరణలకు పుట్టినిల్లు. అలాంటి చైనాలో దూరంగా ఉంటున్న జంటల కోసం సరికొత్త పరికరాన్ని కనిపెట్టింది. ఇది దూరంగా ఉన్న ప్రేమికులకు బాగా

పనికొస్తుంది.
ఎదుటివారి పై ప్రేమను ఎలా తెలియచేస్తాం? అయితే నోటితో చెబుతాం. లేకపోతే ఒక ముద్దు పెట్టి వారి పై ఉన్న ప్రేమను అంతే ప్రేమగా తెలియచేస్తాం. ముద్దు చాలా ఒత్తిడులను తగ్గిస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు. ముద్దులో ఉన్న గొప్పతనం అలాంటిది. ఒక అమ్మ బిడ్డకు, ప్రేమికులు, స్నేహితులు.. ఇలా రకరకాల ముద్దులుంటాయి.

కొత్త ఆవిష్కరణ..
దగ్గరగా ఉన్నప్పుడు ముద్దు ఈజీగా పెట్టేస్తారు. దూరంగా ఉన్నప్పుడు ఆ ముద్దు అనుభూతిని ఎలా పొందడం? ఇదే ఆలోచన వచ్చింది ఒక చైనా స్టూడెంట్ కి. కదిలే సిలికాన్ పెదవులను తయారు చేశాడు. ఇది ప్రెజర్ సెన్సార్స్, యాక్యుయేటర్ లతో అమర్చారు. దీనివల్ల పెదవుల ఒత్తిడి, కదలిక, ఉష్ణోగ్రతను కూడా ఎదుటివారికి తెలిసిపోతుంది. కేవలం కిస్సింగ్ ఎమోషనే కాదు, ముద్దు ధ్వనిని కూడా ఇది అందిస్తుంది.

ఎందుకు..?
చాంగ్ జౌలోని ఒక విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి అయిన జియాంగ్ ఝోంగ్లీ ఈ పరికరాన్ని తయారు చేశాడు. దీనికి కారణం తన ప్రేయసి దూరంగా ఉండడమే. తనతో ఫోన్లలో మాట్లాడడం, వీడియో కాల్స్ లో చూడడం అతనికి ఎందుకో నచ్చలేదు. తన ప్రియురాలికి మరింత దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలనే ఆలోచన చేశాడు. అలా తయారైందే ఈ పరికరం. వర్చువల్ రియాలిటీలో సన్నిహితులతో మధుర క్షణాలను పంచుకోవడంలో ఈ పరికరం సహాయపడుతుంది.

ఎలా..?
ఈ పరికరం మరి దూరపు మనుషులను ఎలా దగ్గర చేస్తుందో తెలుసుకోవాలి కదా! దీనికి సంబంధించిన యాప్ ను మొబైల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి. పరికరాన్ని ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ లోకి ప్లగ్ చేయాలి. యాప్ లో వారి సన్నిహితులను జతచేసి జంటలు వీడియో కాల్ ని ప్రారంభవించవచ్చు. ఆ తర్వాత వారి ముద్దుల పరంపరను కొనసాగించవచ్చు. ఈ పరికరాన్ని 2019లో జియాంగ్ దరఖాస్తు చేసుకున్న తర్వాత చాంగ్ జౌ వొకేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెకాట్రానిక్ టెక్నాలజీ ద్వారా పేటెంట్ పొందాడు. దీని ధర 260 యువాన్లు గా ప్రకటించారు. అంటే మన కరెన్సీలో 3వేల రూపాయలకు పైమాటే. చైనాలో ఈ పరికరం ఇప్పుడు హాట్ కేక్ ల అమ్ముడవుతున్నదట.