This couple's action-packed pre-wedding photoshoot looks no less than a movie
mictv telugu

వీళ్ల దుంపతెగ.. ఇదెక్కడి ప్రీ వెడ్డింగ్ షూట్ రా నాయనా.!

October 28, 2022

This couple's action-packed pre-wedding photoshoot looks no less than a movie

జీవితంలో ఒకసారే జరగబోయే తమ పెళ్లి వేడుకలని డిఫరెంట్‌గా జరుపుకోవాలనుకున్నారు ఓ జంట. అందుకే మిగతా వాళ్లలా సముద్ర తీర ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలు, పూల తోటలలో కాకుండా ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ చేశారు. ఫొటోషూట్‌లో భాగంగా ఆ జంట చేసిన బైక్ స్టంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్విటర్‌లో షేర్ చేసిన వీడియోలో.. వధూవరులిద్దరూ బైక్‌పై కూర్చొని ఉన్నారు. వారి బైక్ ని క్రేన్ పట్టుకొని ఉంది. వారు ఎక్కిన బైక్… కారు మీద నుంచి పైకి పోయే విధంగా ఓ బాలీవుడ్ సినిమా స్టైల్ లో సెటప్ చేశారు.

నిజానికి కొద్దిగా స్లిప్ అయినా కూడా బైక్ మీద నుంచి ఇద్దరూ కిందపడి పోయేవారు. అంత డేంజరేస్‌గా ఉందా స్టంట్. ఇప్పుడు వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ ఫీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్టుకి 15 వేల లైక్స్ వచ్చాయి. కామెంట్ల వర్షం కురుస్తూనే ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ని డైరెక్ట్ చేస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. కాస్త అటు ఇటు అయితే హాస్పిటల్ లో ఉంటారని మరికొంతమంది అంటున్నారు.