"సినారె నుంచి ఈతరం ఎంతో నేర్చుకోవాలి"…! - MicTv.in - Telugu News
mictv telugu

"సినారె నుంచి ఈతరం ఎంతో నేర్చుకోవాలి"…!

July 29, 2017

ఎంత ఎత్తుకు ఎదిగినా  ఒదిగి ఉన్న మహనీయుడు సి.నారాయణరెడ్డి అని నిజామాబాద్ ఎంపీ కవిత కొనియాడారు. ఆయన నుంచి ఈ తరం ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. సినారె రాసిన 3 వేల 500 చలన చిత్ర గేయాలను పదిల పరుస్తామన్నారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సినారె 87వ జయంతి కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్‌ అభివృద్ధికి తన ఎంపీ నిధుల నుంచి రూ. 10 లక్షలు ఇస్తానని కవిత ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,  తెలంగాణ సాహిత్య పరిషత్ చైర్మన్ నందిని సిధారెడ్డి, సీఎంఓ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ సత్యనారాయణ, మాజీ వైస్ చాన్సలర్లు ఎన్.గోపి, ఎల్లూరి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సినారె చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఆయన రచనల సంకలనాన్ని ఆవిష్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సినారె ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు.