వెనుక ఇద్దర్ని వేసుకుని బైక్ నడిపిన కుక్క(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

వెనుక ఇద్దర్ని వేసుకుని బైక్ నడిపిన కుక్క(వీడియో)

October 27, 2019

This great dog driving a motorbike on the highway is so happy with life

కుక్కలను కార్లలో, స్కూటీలపై యజమానులు సరదాగా తీసుకుపోతుంటారు. యజమాని బయటకు వెళ్తున్నాడని గ్రహించిన అవి వెంటనే వాహనం వద్దకు చేరిపోతాయి. నేను వస్తానని తెగ మారాం చేస్తుంటాయి. అయితే ఈ కుక్కలన్నీ ఒక ఎత్తు అయితే ఈ కుక్క మాత్రం మరొక ఎత్తు. ఎందుకు అంటారా.. అది ఎంచక్కా బైక్ నడిపింది. చిత్రంగా ఉంది కదూ. అది బైక్ నడిపే వీడియో చూస్తే మీరు ముక్కున వేలు వేసుకోవడం ఖాయం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఆ కుక్క అలా డ్రైవింగ్ చేస్తుంటే వెనక సీట్లో ఇద్దరు కూర్చొని ఉన్నారు. వెనక కూర్చున్న వ్యక్తులు హెల్మెట్ పెట్టుకున్నారు. కానీ డ్రైవింగ్ చేస్తున్న కుక్క మాత్రం హెల్మెట్ ధరించలేదు. గాలి వేగంగా వీస్తుంటే కుక్క అలా డ్రైవింగ్ పైనే దృష్టి పెట్టింది.  అలా గాలి వేగంగా వీచే సమయంలో కుక్క ముందరి కాళ్ళు పొరపాటున పక్కకు జరిగితే ఎంత ప్రమాదం అని ఈ వీడియో చూసినవాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటన బ్రెజిల్‌లో జరిగింది. ఇలాంటివి మన దేశంలో జరిగిఉంటే కుక్కగారికి హెల్మెట్ పెట్టుకోనందుకు, లైసెన్స్ లేనందుకు తప్పకుండా ఫైన్ విధించేవారు కదూ. అయినా నోరులేని మూగజీవాలతో ఇలాంటి ఫీట్లు చేయవద్దు అని కొంతమంది నెటిజన్లు కోరుతున్నారు. మన సరదా వాటి ప్రాణాలకు ముప్పుగా మారవద్దని సలహాలు ఇస్తున్నారు.