రేప్‌‌‌ అనివార్యమైతే ఎంజాయ్ చేయండి.. అమితాబ్ వ్యాఖ్యలపై రచ్చ - MicTv.in - Telugu News
mictv telugu

రేప్‌‌‌ అనివార్యమైతే ఎంజాయ్ చేయండి.. అమితాబ్ వ్యాఖ్యలపై రచ్చ

December 5, 2019

Amitabh Bachchan Said.

నేను మూలకు నక్కిన పిల్లిని.. నన్ను ఎవరు పట్టించుకుంటారులే.. అనుకుంటే పొరపాటే. ఇప్పుడు సోషల్ మీడియా అనే సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ‘అప్పుడేదో సరదాగా మాట్లాడాం..అయిపోయింది’ అనుకుంటే పొరపాటే. దాన్ని తవ్వి తీస్తుంది సోషల్ మీడియా. దానికి ఇప్పడు మీ సంజాయిశీ ఏంటి? మీ బాధ్యతా ఇదా? అని నిలదీస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ బిగ్ బీ ఇలాంటి ఇబ్బందుల్లోనే చిక్కుకున్నారని తెలుస్తోంది. ఆయనను చూస్తే ఎంతో ఠీవీ ఉట్టిపడుతుంది. మంచి నటుడే కాదు సామాజిక స్పృహ ఉన్నవాడు. ఆపదలో ఉన్నవారికి సహాయపడుతున్నాడు. అలాంటి ఆయన అప్పట్లో అత్యాచారాల గురించి దారుణంగా మట్లాడారంటే ఒప్పుకుంటారా? అది అసత్యం అనవచ్చు ఆయన అభిమానులు. ఆయనే అన్నట్టు దానిని రుజువుతో చూపిస్తే? 

దిశ హత్యాచారం ఘటనలాంటి ఓ ఘటనకు సంబంధించి గతంలో అమితాబ్ చేసిన ఆ కామెంట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. 1990లో వచ్చిన ‘మూవీ’ అనే మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ మీద ఓ వార్తను పబ్లిష్ చేశారు. `అత్యాచారం తప్పదన్నప్పుడు.. పడుకుని ఎంజాయ్‌ చేయటమే’ అని ఆయన వ్యాఖ్యానించినట్టుగా ఉంది. గతించిపోయాయనుకున్న ఆ వ్యాఖ్యలు ఆయన్ను ఇప్పుడు ఇబ్బందులు పాలు చేయనున్నాయా? అన్నది ఆ వార్త సారాంశం. అయితే అప్పట్లో ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయో తెలియదుగానీ.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో అమితాబ్‌ చేసిన ఆ కామెంట్‌ తెగ చక్కర్లు కొడుతోంది. అప్పట్లో అమితాబ్ యాంగ్రీ యంగ్ మెన్‌గా బాలీవుడ్‌ను ఏలుతున్నారు. 

తాజాగా జరిగిన దిశ ఘటనతో దేశమంతా అట్టుడుకుతోంది. ప్రజలు నిందితుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహిళల భద్రత పట్ల చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా అమితాబ్‌ వ్యాఖ్యలను తెర మీదకు తీసుకువచ్చిన కొంత మంది నెటిజెన్లు.. ‘బాలీవుడ్ సూపర్‌ స్టార్లే ఇలా మాట్లాడుతుంటే ఇక రక్షణ ఎక్కడ ఉంటుంది?’ అని ప్రశ్నిస్తున్నారు.