ఇదొక న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ చిత్రం: మహేశ్ బాబు - MicTv.in - Telugu News
mictv telugu

ఇదొక న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ చిత్రం: మహేశ్ బాబు

July 3, 2022

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ట్విట్ తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడు షూటింగుల్లో, కుటుంబ సభ్యులతో బీజీబీజీగా ఉండే ఆయన చాలా రోజుల తర్వాత తమిళ హీరో, విలక్షణ నటుడు, ఉలగ నాయగన్‌ అయిన కమల్ హాసన్ సినిమా గురించి తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

కమల్ హాసన్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్‌గా, హీరో సూర్య కీలకపాత్రలో కనిపించిన చిత్రం ‘విక్రమ్‌’. ఈ సినిమాను లోకేష్ కనకరాజ్‌ తెరకెక్కించారు. ఈ సినిమా తమిళంతోపాటు అన్నీ భాషల్లో జూన్‌ 3న విడుదలై, పెద్ద సక్సెస్‌ను అందుకుంది. విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకూ విక్రమ్ సినిమా దాదాపు రూ. 400 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో ఈ మూవీపై టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు పొగడ్తల వర్షం కురిపించాడు.

”విక్రమ్‌ బ్లాక్‌బస్టర్ సినిమా. ఒక న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ చిత్రం. లోకేశ్ కనకరాజ్ నేను మిమ్మల్ని కలిసి విక్రమ్‌ మూవీ ప్రారంభం నుంచి చివరి వరకు షూటింగ్ ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఉంది. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్ తమ అద్భుతమైన నటనతో మెరిపించేశారు. అనిరుధ్‌ బెస్ట్ మ్యూజిక్ అందించాడు. చాలాకాలం తర్వాత నా ప్లే లిస్ట్‌ టాప్‌లో విక్రమ్‌ ఉంది. ఇక, చివరిగా లెజెండ్‌ కమల్‌ హాసన్‌ నటన గురించి చెప్పేందుకు నాకు అర్హత లేదు. ఒక అభిమానిగా చాలా గర్వంగా ఉంది. మీకు, మీ అద్భుతమైన బృందానికి శుభాకాంక్షలు.” అని మహేశ్‌ బాబు ట్విట్‌ చేశాడు.