ఇదేం హోలీ రా బాబు.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇదేం హోలీ రా బాబు.. వీడియో వైరల్

March 18, 2022

bcbcb

‘హోలీ’పండగ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హోలీ ఎప్పుడెప్పుడు వస్తుంది. ఎప్పుడెప్పుడు వరుసైన వారిపై రంగులు చల్లాలి అని యువత అత్రుతగా ఎదురుచూస్తుంటారు. అంతేకాకుండా హోలీ వస్తుందంటే చాలు దేశమంతా రంగుల పండుగే. దేశంలో దీపావళి పండగ తర్వాత రకరకాల రంగులతో చిన్న, యువత, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా ఆనందంగా జరుపుకునే పండగ హూలీ.

ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు చేప్తున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని ‘హోళికా పుర్ణిమ’గా కూడ వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. గత రెండు సంవత్సరాలపాటు కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఈ పండగను జరుపుకోలేదు. ఈ తరుణంలో ఈ ఏడాది రెట్టింపు ఉత్సాహంతో యువత సంబరాల్లో పాల్గొన్నారు. స్కూళ్లు, కళాశాలలు, అపార్ట్‌మెంట్లు హోలీ సెలబ్రేషన్స్ స్పాట్లుగా మారాయి. రంగులు పూసుకుని, రంగునీళ్లు చల్లుకుంటూ యువత ఎంజాయ్ చేశారు.

ఈ సందర్భంగా పలు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ నాయకులు, సినీ హీరోలు హూలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి తరుణంలో కొన్ని చోట్ల యువత పండగను విచిత్రంగా జరుపుకున్నారు. రంగులు పూసుకొని ఆనందంగా జరుపుకోవాల్సిన పండగను.. అల్లరి చిల్లరగా ప్రవరిస్తూ, కొంతమంది కుర్రకారులు కలిసి ఓ వ్యక్తిని అటు ఇటు ఊపుతూ, పాట పాడుతూ, కేకలు వేస్తూ ఓ మురుగు నీటి కలువలో పడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. వీడియోను వీక్షిస్తున్న కొంతమంది అయ్యో ఇదేమి హూలీ రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది కుర్రకారుపై మండిపడుతున్నారు. మురికి కాల్వలో పడేసిన వ్యక్తికి ఎదైనా జరిగితే ఎవరు బాధ్యులు అంటూ కుర్రకారుపై విమర్శలు గుప్పిస్తున్నారు.