This is just a teaser..the real game is ahead: Putin
mictv telugu

ఇది జస్ట్ టీజరే..అసలు ఆట ముందుంది: పుతిన్

July 9, 2022

This is just a teaser..the real game is ahead: Putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటే తెలియని వారుండరు. గత నాలుగు నెలలుగా ప్రపంచ దేశాల అధ్యక్షులు ‘శాంతి ముద్దు-అహింస వద్దు’ అని పుతిన్‌ను ఎంత బతిమాలుతున్న ఎవరి మాటను పట్టించుకోకుండా ఉక్రెయిన్ దేశంపై దాడులు చేస్తూనే ఉన్నాడు. తాజాగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ఉక్రెయిన్ దేశం వీలైనంత త్వరగా మా నియమ నిబంధలను అంగీకరించకపోతే ఇప్పటిదాక జస్ట్ టీజర్‌ని మాత్రమే చూపించాము. ఇకపై అసలు ఆటను మొదలుపెడతాము’ అని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.

”ఉక్రెయిన్ ప్రజలకు ఇది విషాదం లాంటిదే. కానీ, ప్రస్తుత పరిణామాలు ఈ దిశగానే వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పశ్చిమ దేశాలు శత్రుత్వానికి ఆజ్యం పోస్తున్నాయి. యుద్ధం ముగింపు కోసం నేను చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాను. కానీ, ఈ ప్రక్రియ ఎంత ఆలస్యమైతే మాతో ఒప్పందం చేసుకోవడం అంతే కష్టమవుతుంది. వీలైనంత త్వరగా మా నిబంధనలను అంగీకరించాలి. లేనిపక్షంలో మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉండాలి. ‘ఇప్పటివరకు జరిగింది జస్ట్ ట్రయల్ మాత్రమే. యుద్ధభూమిలో మాస్కో సేనలు ఇంకా మా అసలైన చర్యను ప్రారంభించనే లేదు” అని పుతిన్ అన్నారని రష్యా దేశపు వార్త పత్రికలు కథనాలను ప్రచురించాయి.

మరోపక్క రష్యా దేశపు సైన్యాలు సైనిక చర్య పేరిట ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడులు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆ దేశ రాజధాని కీను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన మాస్కో సేనలు..ఇటీవల లుహాన్స్‌పై పట్టు సాధించాయి. ఇరు దేశాల మధ్య దాదాపు నాలుగున్నర నెలలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్దం ఎప్పుడు ముగుస్తుందో, ఎప్పుడు మళ్లీ ఉక్రెయిన్ ప్రజలు విముక్తి కలుగుతుందో తెలియక అటు రష్యా దేశపు ప్రజలు, ఇటు ఉక్రెయిన్ దేశపు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.