నాకు ఇవే చివరి ఎన్నికలు.. మోత్కుపల్లి - MicTv.in - Telugu News
mictv telugu

నాకు ఇవే చివరి ఎన్నికలు.. మోత్కుపల్లి

September 26, 2018

సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నర్సింహులు తన రాజకీయ భవిష్యత్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి జరిగే ఎన్నికలే తన జీవితంలో ఆఖరివని అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆలేరు నియోజకవర్గ ప్రజలు ఇష్టం మేరకు వచ్చే ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.This Is Last Elections For Me : Motkupalli Narasimhulu ‘యాదగరిగుట్టలో గురువారం యాదగిరిగుట్టలో మోత్కుపల్లి శంఖారావం సభను నిర్వహిస్తున్నాను. ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆలేరుకు గోదావరి జలాలను తీసుకురావడమే నా లక్ష్యం. నేను రాజకీయ నాయకుడిని కాదు.. ప్రజా సేవకుడిని’ అని మోత్కుపల్లి అన్నారు.

మోత్కుపల్లి నర్సింహులు తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అధినేత చంద్రబాబుపై బహిరంగ విమర్శలు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత మోత్కుపల్లి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరుతాని పుకార్లు వచ్చినా.. ఆయన మాత్రం ఏ పార్టీలో చేరకుండా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సొంత నియోజకవర్గం ఆలేరు నుంచి బరిలోకి దిగడంతో ఆసక్తి నెలకొంది.