ఏపీలో కొత్త మంత్రుల ఫైనల్ లిస్ట్ ఇదీ! - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో కొత్త మంత్రుల ఫైనల్ లిస్ట్ ఇదీ!

April 8, 2022

ఏపీలో ఇప్పుడు ఒకటే టెన్షన్. 24 మంది మంత్రులు రాజీనామా చేయడంతో మలిదశలో ఎవరికి మంత్రి పదవి దక్కనుందనే చర్చ అక్కడ జోరుగా నడుస్తోంది. పాతవారిలో కొందరికి తిరిగి అవకాశమిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎవరికి వారు ఊహాగానాలు చేస్తున్నారు. ఈ నెల 11న కొత్త మంత్రివర్గం కొలువుదీరుతుండగా, ఫలానా వారికి మంత్రి పదవి దక్కుతుందని నాయకుల అనుచరులు చర్చించుకుంటున్నారు. మెజారిటీ ప్రజలు, విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కులాల వారీగా చూస్తే బీసీ సామాజిక వర్గానికి కేబినెట్‌లో 9 మందికి, ఎస్సీలకు 6, ఎస్టీలకు 2, కాపులకు 3, రెడ్డి సామాజిక వర్గం నుంచి 3, కమ్మ, ముస్లిం వర్గాల నుంచి ఒకరికి అవకాశమిస్తారని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొత్త కేబినెట్‌లోకి శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్, అనకాపల్లి నుంచి గుడివాడ అమరనాథ్, సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి, చిలకలూరి పేట నుంచి రజనీలకు పదవులు ఖాయమయ్యాయని వైసీపీ నేతలు చెప్తున్నారు.